‘అర్జున్ రెడ్డి’  తెలుగు సినిమా బాక్సాఫీసులను బద్దలు చేసిన మూవీ. విజయ్ దేవరకొండను కెరీర్ పరంగా ఎక్కడికో తీసుకెళ్లిన సినిమా అది. సందీప్ రెడ్డి వంగా ఆ సినిమాను డిఫరెంట్ కథగా  తెరకెక్కించారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఆ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. అంతలా పేరు తెచ్చుకున్న ఈ సినిమా   ఈ నెల 21వ తేదీన బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కబీర్ సింగ్’ చిత్రంలో షాహిద్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ నటించింది. 

తనను ఓవర్ నైట్ లో స్టార్ డైరక్టర్ చేసిన ఈ చిత్రం టైటిల్ ని తన కుమారుడుకు పేరుగా పెట్టుకున్నాను అంటున్నారు సందీప్ రెడ్డి. జూన్ 21 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న హిందీ అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఈ విషయం చెప్పుకొచ్చారు సందీప్ రెడ్డి వంగా. 

సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ .. ‘అర్జున్ రెడ్డి’ అనే సినిమాను నేను ఓ యజ్ఞంలా భావించి నా ప్రాణం పెట్టి చేశాను. ఈ నా ప్రయత్నంలో నిర్మాతలు,కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది . అందుకే నా కొడుకుకి ‘అర్జున్ రెడ్డి’ అనే పేరు పెట్టుకున్నాను. ఆ సినిమా అంటే నాకు ఎంత ఇష్టమనేది ఇప్పుడు మీకు అర్థమైపోయుంటుంది. ‘కబీర్ సింగ్’ కూడా అందరికి నచ్చి మంచి విజయం సాదిస్తుందని అని అన్నారు.