యువ హీరో సందీప్ కిషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 8 ఏళ్ళు దాటింది. సోలో హీరోగా  మొదట వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న సందీప్ ఆ తరువాత గ్యాప్ లేకుండా సినిమాలు చేశాడు. 20కి పైగా డిఫరెంట్ సినిమాలు చేసిన సందీప్ పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోయారు. ఫైనల్ గా మొన్న నిను వీడని నీడను నేనే అంటూ ఓ సక్సెస్ అందుకున్నాడు. 

ఆ సినిమాను సందీప్ సొంతంగా నిర్మించారు. అయితే నెక్స్ట్ కూడా అలాంటి సక్సెస్ మరోటి అందుకోవాలని సందీప్ కామెడీ ఎంటర్టైనర్ తో సిద్దమవుతున్నాడు. సీనియర్ దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో తెనాలి రామకృష్ణ అనే సినిమా చేస్తున్న సందీప్ దసరా అనంతరం ఆ ప్రాజెక్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. అక్టోబర్ 18న పెద్ద సినిమాల హడావుడి ఉండదు కాబట్టి అదే డేట్ కి సినిమాను రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నాడు. 

గతంలో ఎప్పుడు లేని విధంగా లాయర్ పాత్రలో సందీప్ నవ్వించనున్నట్లు టీజర్ తోనే మంచి బజ్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ఎండింగ్ దశలో ఉంది. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ట్రైలర్ ని అలాగే సాంగ్స్ ని కూడా విడుదల చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు. హన్సిక ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.