హీరో సందీప్ కిషన్ ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి ఆయన హర్రర్ థ్రిల్లర్ ఎంచుకున్నారు. ఊరు పేరు భైరవకోన ట్రైలర్ విడుదలైంది.
యంగ్ హీరో సందీప్ కిషన్ కి వెంటనే ఓ హిట్ కావాలి. ఆయన సక్సెస్ రుచి చూసి చాలా ఏళ్ళు అవుతుంది. డిఫరెంట్ జోనర్స్ ట్రై చేసినా విజయం మాత్రం దక్కలేదు. ఈసారి హారర్ థ్రిల్లర్ ఎంచుకున్నాడు. ఊరు పేరు భైరవకోన విడుదలకు సిద్ధం అయ్యింది. నేడు ట్రైలర్ విడుదల చేశారు. రెండు నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. విజువల్స్, వాయిస్ ఓవర్ డైలాగ్స్ గూస్ బంప్స్ కలిగించాయి. భైరవకోన కేంద్రంగా జరిగే విపరీత పరిణామాల సమాహారమే ఊరు పేరు భైరవకోన చిత్రం.
కథ గురించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు. సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంది. హీరోయిన్ కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ సైతం సీరియస్ రోల్స్ లో కనిపించారు. మొత్తంగా ఊరు పేరు భైరవకోన ట్రైలర్ మెప్పించింది. సినిమా మీద అంచనాలు పెంచింది. సస్పెన్సు, హారర్ థ్రిల్లర్స్ ఈ మధ్య ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.
కాంతార, విరూపాక్ష, మంగళవారం ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. అదే కోవలో ఊరు పేరు భైరవకోన తెరకెక్కింది. వి ఐ ఆనంద్ ఈ చిత్ర దర్శకుడు. గతంలో ఆయన తెరకెక్కించిన ఎక్కడికిపోతావు చిన్నవాడా మంచి విజయం సాధించింది. వి ఐ ఆనంద్ తెరకెక్కించిన డిస్కో రాజా మాత్రం నిరాశపరిచింది. వి ఐ ఆనంద్ కూడా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రాజేష్ దండ నిర్మాత. శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. ఫిబ్రవరి 9న గ్రాండ్ గా విడుదల కానుంది.

