వరుస అపజయాలతో గత కొన్నేళ్లుగా సతమతమవుతున్న యువ హీరో సందీప్ కిషన్ ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నట్లు తెలుస్తోంది. నిను వీడని నీడను నేను సినిమాకు అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లు ఈ సారి జరగకుండా తానే నిర్మాతగా మారి సొంత ఖర్చుతో సినిమాను తెరకెక్కించాడు. 

పాజిటివ్ రివ్యూస్ కూడా రావడంతో సినిమాకు రోజు రోజుకి ఆదరణ పెరుగుతోంది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే.. సందీప్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు వచ్చిన మొదటి రోజు గ్రాస్ కల్లెక్షన్స్ చాలా ఎక్కువే అని చెప్పాలి. సినిమాకు మంచి ప్రమోషన్స్ చేసి జనాల్లోకి తీసుకెళ్లిన సందీప్ మొదటి రోజు 1.70కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో మంచి ఓపెనింగ్స్ ను రాబట్టాడు.    

సందీప్ గత రెండు సినిమాల కలెక్షన్స్ కంటే ఈ గ్రాస్ కలెక్షన్స్ ఆరు రేట్లు ఎక్కువ. కెరీర్ మొదట్లో వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ తరువాత ఈ స్థాయిలో సందీప్ హిట్టందుకోలేదు. వీకెండ్స్ లో కూడా ప్రీ బుకింగ్స్ బావున్నాయి. దీంతో కలెక్షన్స్ డోస్ కూడా పెరిగే అవకాశం ఉంది. మరి మొత్తంగా ఈ సినిమా ఎంతవరకు లాభాల్ని అందిస్తుందో చూడాలి.