కుర్ర హీరో సందీప్ కిషన్ ఫైనల్ గా మంచి సక్సెస్ అందుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నిను వీడని నేను సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. వసూళ్ళలో ఈ సినిమా సందీప్ కెరీర్ కి మరో బూస్ట్ ఇచ్చింది. అయితే ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తోన్న సందీప్ కి ఓ కామెంట్ బాధించింది. 

నిను వీడని నేను సినిమా కలెక్షన్స్ ఇండియాలో బాగానే ఉన్నప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం అనుకున్నంతగా రాబట్టలేకపోయింది. విదేశాల్లో ఈ సినిమా ప్లాప్ అంటూ.. అమెరికాలో అయితే మరి తక్కువ డాలర్లు రాబట్టినట్లు ప్రముఖ వెబ్ సైట్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ట్వీట్ పై స్పందించిన సందీప్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. 

ప్లాప్ అని చెప్పుకోవడానికి నేనెప్పుడూ సంకోచించలేదు. ఈ సినిమా విదేశాల్లో ఎక్కువ వసూళ్లు అందుకోలేదు. మీ మాటలకు నేను ఏకీభవిస్తున్నా. కానీ ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కావాలంటే సెర్చ్ చేసి చూడు. విదేశాల్లో కలెక్షన్స్ రాలేదని విమర్శించినట్టుగానే.. స్వదేశంలో వచ్చిన కలెక్షన్స్ ని మెచ్చుకో అని సందీప్ పేర్కొన్నాడు.