యంగ్ హీరో సందీప్ కిషన్ సరైన హిట్టు పడక కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మధ్యలో తమిళంలో కొన్ని సినిమాలు చేశాడు. అవి ఓ మోస్తరుగా ఆడినా.. తెలుగులో మాత్రం ఈ హీరోకి సక్సెస్ రావడం లేదు. రకరకాల జోనర్లు ఎన్ని ప్రయత్నిస్తున్నా.. వర్కవుట్ కావడం లేదు.

దీంతో తనే నిర్మాతగా మారి 'నిను వీడని నీడను నేనే' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. తాజాగా సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ సందర్భంగా ఓ అగ్రనిర్మాత తనను అవమానపరిచాడని సందీప్ కిషన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

తాను వరుసగా ఫ్లాప్ లు ఎదుర్కోవడంతో తన పనైపోయిందని.. ఇక సినిమాలు మానుకోవాలని ఆ పెద్ద నిర్మాత అన్నాడని సందీప్ వెల్లడించాడు. ఆ మాటలు తనను 
ఎంతగానో బాధించాయని.. కానీ తానేమీ ఆ నిర్మాతపై కక్ష పెంచుకోలేదని సందీప్ చెప్పాడు.

ఆయన మాటలను పాజిటివ్ గా తీసుకొని తనేంటో నిరూపించుకోవాలనే పట్టుదలతో నిర్మాతగా మారి 'నిను వీడని నీడను నేనే' సినిమా తీసినట్లు సందీప్ చెప్పుకొచ్చాడు. తనను అవమానపరిచిన ఆ అగ్ర నిర్మాత ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

సందీప్ కోరుకుంటున్నట్లుగా 'నిను వీడని నీడను నేనే' సినిమాతో సక్సెస్ అందుకొని ఆ అగ్ర నిర్మాతకు సమాధానం చెబుతాడేమో చూడాలి.. కార్తిక్ రాజు అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.