టాలీవుడ్ లో యువ హీరో సందీప్ కిషన్ చేసిన సినిమాలు గత 5 ఏళ్లలో ఏ హీరో చేయలేదని చెప్పాలి. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మనోడి స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే సందీప్ కిషన్ ఇంతవరకు ఆడియెన్స్ ని మెప్పించింది మాత్రం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతోనే. 

2013లో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా సందీప్ కెరీర్ ను ఒక్కసారిగా మార్చేసింది. ఇకపోతే ఆ రేంజ్ లో మళ్ళీ హిట్ అందుకోలేదు ఈ యువ హీరో. ఇప్పుడు మళ్ళీ ఒక కామెడీ ఎంటర్టైనర్ తో హిట్టుకొట్టాలనే కష్టపడుతున్నాడు. జీ.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాపై చిత్ర యూనిట్ చాలా నమ్మకంతో ఉంది. 

ఎప్పుడు లేని విధంగా సరికొత్త కామెడీ టైమింగ్ తో సినిమా మేకింగ్ ఉందని టాక్ వస్తోంది. షూటింగ్ లో చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెన్స్ గా ముందుకు వెళుతోంది. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ సినిమాతో పాటు మరో హారర్ సినిమాతో కూడా సందీప్ కిషన్ బిజీగా ఉన్నాడు.