అవకాశాలు ఎన్ని వస్తున్నా కూడా రిజల్ట్ లో మాత్రం తేడా రావడం లేదు. ఈ పరిస్థితి సందీప్ కిషన్ కి తప్పితే మరో హీరోకు లేదనే చెప్పాలి. ఎంతో కొంత లాభం ఇవ్వాల్సిన సినిమాలు ప్రతి ఒక్కటి డిజాస్టర్ గా మారుతుంటే మనోడు మాత్రం రిజల్ట్ తో సంబంధం లేకుండా అవకాశాలను అందుకోవడం గమనార్హం. 

నటనలో బాగానే కష్టపడుతున్నాడు. అలాగే కొత్త కథలు ఎంచుకుంటున్నాడు. కానీ సినిమాలు అలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. 'నెక్స్ట్ ఏంటి' సినిమా డిజాస్టర్ అనంతరం మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు ఈ లక్కీ హీరో. ఇటివల సుబ్రహ్మణ్యపురం సినిమాను తెరకెక్కించిన సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో వర్క్ చేయడానికి సందీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

ద్రోణాచార్య - ఏకలవ్యుడి కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్క నున్నట్లు తెలుస్తోంది. నేటితరం గురువు శిష్యుడు అడిగిన కోరిక ఏమిటనే పాయింట్ తో దర్శకడు కథను తెరకెక్కించనున్నాడు. కార్తికేయ నిర్మాత శ్రీనివాస్ ఈ సరికొత్త కథను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇక త్వరలోనే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.