కెరీర్ మొదట్లో మంచి సక్సెస్ తో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ ఆ తరువాత వరుస అపజయాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎన్ని ప్రయోగాలు చేసినా పరభాషలో అందుకున్నంత హిట్ టాక్ ను తెలుగులో మాత్రం అందుకోలేదు. రీసెంట్ గా వచ్చిన నెక్స్ట్ ఏంటి సినిమా కూడా  ఈ యువ హీరోకి సక్సెస్ ఇవ్వలేదు. 

అయితే ఈ వరుస అపజయాలపై సందీప్ కిషన్ స్పందించాడు. ప్రతి ఒక్కరి కెరీర్ కి ఎదో ఒక విషయం చాలా మార్పును తెస్తుందని నా తప్పులు తెలుసుకొని మళ్ళీ ఒక క్లారిటీకి రావడానికి దేశాన్ని విడిచి ఎక్కడికైనా దూరంగా వెళ్లాలని ఉందని అన్నాడు. షూటింగ్ లోనే మన చేస్తున్న పనిపై ఒక అవగాహనా ఏర్పడుతుంది. మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవచ్చని ఇక నుంచి సరైన నిర్ణయాలతో ముందుకు సాగాలని వివరణ ఇచ్చాడు. 

ప్రస్తుతం సందీప్ నిను వీడని నేను అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అనంతరం సందీప్ అమెరికా లేదా యూరప్ నగరాలకు వెళ్లి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నాడు. మరి ఆ యాత్రల ఫలితం ఈ హీరోకి ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.