సినీ రంగంతో డ్రగ్స్‌ రాకెట్‌ సంబంధాలు ఎప్పుడు చర్చానీయాంశంగానే ఉంటాయి. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో డ్రగ్‌ మాఫియా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా సాండల్‌వుడ్‌లోనూ డ్రగ్స్‌ మాఫియా ప్రకంపనలు సృస్టిస్తోంది. ఇప్పటికే పలువరు సాండల్‌వుడ్‌ ప్రముఖులకు నోటీసలు అందగా తాజాగా దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేష్ వ్యాఖ్యలతో ఈ కేసే మరింత సంచలనంగా మారింది.

తాజాగా సిటీ క్రైమ్‌ బ్రాంచ్‌ కొంత మంది సాండల్‌ వుడ్‌ ప్రముఖుల మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే చాలా మంది సినీ ప్రముఖులను ప్రశ్నించేందుకు సీసీబీ రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా సమాచారం మేరకు స్టార్‌ హీరోయిన్‌ రాగిణి ద్వివేదిని ఈ రోజు సీసీబీ పోలీసులు ప్రశ్నించనున్నారు.

ఇటీవల బయట పడిన డ్రగ్‌ స్కాండల్‌తో పాటు ఇండస్ట్రీ ప్రముఖులకు డ్రగ్స్‌ తో ఉన్న సంబంధాల గురించి కూడా ఆరా తీస్తున్నారు. సాండల్‌వుడ్‌ ముందుగా ఈ కేసుకు సంబంధించి ఇంద్రజిత్ లంకేష్ పేరే ప్రధానంగా వినిపించింది. ఆ తరువాత ఒక్కొక్కురుగా సాండల్‌వుడ్‌ స్టార్స్‌కు ఈ కేసుతో సంబంధాలు ఉన్నట్టుగా బయటకు వస్తుండం, ఇప్పటికే కొంత మంది టాప్‌ స్టార్లకు నోటీసులు కూడా అందటంతో ఇండస్ట్రీ వర్గాల్లో కలవరం మొదలైంది. ముందు ముందు ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.