RRR టీమ్ కు వినూత్న శుభాకాంక్షలు.. శాండ్ ఆర్ట్ తో విషెస్ తెలిపిన అభిమానులు.. వైరల్ వీడియో

ప్రతిష్టాత్మక ‘ఆస్కార్’ అవార్డు దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ పై  ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా ఓ అభిమాని వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 

Sand Artist special Congratulations to RRR team to oscar award for naatu naatu

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’కు ప్రతిష్టాత్మక ‘ఆస్కార్’ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. 95వ ఆస్కార్ వేడుకలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి  (MM Keeravani), లిరిసిస్ట్ చంద్రబోస్ (Chandra Bose) అవార్డును స్వీకరించిన విషయం తెలిసిందే. మార్చి 13న ఆస్కార్ ను దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’టీమ్ పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. ఇంకా ‘నానా  నాటు’ క్రియేట్ చేసిన హిస్టరీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా ఇద్దరు శాండ్ ఆర్టిస్ట్ తన ఆర్ట్ తో వినూత్నంగా విషెస్ తెలిపి అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. 

 తాజాగా అంతర్జాతీయ శాండ్ యానిమేటర్ మాసస్ సాహు (Manas Sahoo) దాదాపు 7 గంటలు శ్రమించి.. రామ చరణ్, ఎన్టీఆర్ నాటునాటు స్టిల్స్, ఆర్ఆర్ఆర్ టైటిట్ గల శాండ్ యానిమేషన్ వీడియోతో చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో Naatu Naatu కు ఆస్కార్ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తను గర్విస్తున్నానని.. ఇందుకు కారణమైన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ తో పాటు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

 

అలాగే ఒడిశాలోని పూరీకి చెందిన ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) కూడా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కు, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒడిషాలోని పూరీ బీచ్ లో ‘ఆస్కార్’ అవార్డును సాధించిన RRR నాటు నాటు డాన్స్ చిత్రాన్ని, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ‘ఎలిఫెంట్ విస్పర్స్’లోని గజరాజును, ఎత్తైన ఆస్కార్ అవార్డును శాండ్ ఆర్ట్ వేసి కళాత్మకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇలా వినూత్నంగా శుభాకాంక్షలు తెలపడంతో నెట్టింట వీడియోలు వైరల్ అవుతున్నాయి.

 

ఆస్కార్ అవార్డు దక్కడంతో ఇండియన్ సినిమా ఖ్యాతి పెరగడంతో పాటు.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ పెరిగిపోయింది. దీంతో వారి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై భారీ హైప్ నెలకొంది. గ్లోబల్ గా రామ్ చరణ్, ఎన్టీఆర్ పేరు మారుమోగుతోంది. గోల్డెన్ గ్లోబ్ మరియు ఆస్కార్ వేడుకల సందర్భంగా ‘నాటు నాటు’ కోసం, ఎన్టీఆర్ కోసం పదిరెట్లు ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సెర్చ్ చేసినట్టుగా రికార్డు క్రియేట్ అయ్యింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios