టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో, నటసింహం బాలయ్య బాబు కాళ్లకు నమస్కారం చేసింది ఓ హీరోయిన్. ఇంకీ ఎవరా స్టార్ బ్యూటీ, ఎందుకు బాలకృష్ణ కాళ్లు మొక్కింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఎక్కడిదో తెలుసా?
నట సింహం బాలయ్య ఏం చేసినా అది ప్రత్యేకంగానే ఉంటుంది. కొన్ని కొన్ని అద్భుతాలు ఆయన వల్లే సాధ్యం. 65 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ.. సక్సెస్ లు చూస్తు దూసుకుపోతున్నాడు బాలయ్య బాబు. ఇక గతంలో లేదు కాని.. ఈ మధ్య కాలంలో కమర్షియల్ యాడ్స్ లో కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎక్కువగా జ్యువెల్లరీయాడ్స్ చేస్తున్నారు బాలయ్య. ఈక్రమంలో రీసెంట్ గా ఓ స్టార్ హీరోయిన్ బాలయ్య కాళ్లు మొక్కడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే?
టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ ఏలూరు నగరంలో సందడి చేశారు. ఆయనతో పాటు హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా ఉన్నారు. ఇద్దరు స్టార్స్ కలిసి స్థానిక బస్టాండ్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ ప్రముఖ జ్యువెల్లరీ షాప్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణను చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ తన రాబోయే సినిమా 'అఖండ 2' గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమా షూటింగ్ పూర్తయింది. చాలా బాగా వచ్చింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదలవుతుంది, అని ఆయన తెలిపారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
అయితే ఈ కార్యక్రమంలో ఒక ప్రత్యేక సంఘటన చోటుచేసుకుంది. నటి సంయుక్త మీనన్ బాలకృష్ణ పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలకృష్ణ ఇతరులతో మాట్లాడుతుండగా, సంయుక్త వెనుక నుంచి వచ్చి ఆయన కాళ్లు మొక్కారు. ఈ ఘటన తో ఒక్క క్షణం ఆశ్చర్యపోయిన బాలకృష్ణ వెంటనే స్పందించి "దీర్ఘాయుష్మాన్ భవ" అని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ కార్యక్రమం సందర్భంగా అభిమానుల ఉత్సాహం , సెల్ఫీల కోసం పోటీ పడటంతో ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు సవాల్ గా మారింది. ఇక జ్యువ్వెల్లరీ షాపు యజమానులు బాలకృష్ణను ప్రత్యేకంగా సన్మానించారు. సంయుక్త మీనన్ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఇక బాలయ్య బాబు రావడంతో ఆయన ఫ్యాన్స్ కూడా దిల్ ఖుష్ అవుతున్నారు.
