కేరళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ టాలీవుడ్ లో పట్టిందల్లా బంగారమే అవుతోంది.ప్రస్తుతం సంయుక్త మీనన్ సాయిధరమ్ తేజ్ సరసన విరూపాక్ష అనే చిత్రంలో నటిస్తోంది.
కేరళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ టాలీవుడ్ లో పట్టిందల్లా బంగారమే అవుతోంది. భీమ్లా నాయక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంయుక్త.. ఆ తర్వాత నటించిన బింబిసార, సార్ చిత్రాలు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. దీనితో సంయుక్త క్రేజీ హీరోయిన్ గా మారింది.
సోషల్ మీడియాలో కూడా సంయుక్త సూపర్ యాక్టివ్ గా ఉంటూ ప్రతి అంశాన్ని అభిమానులతో పంచుకుంటోంది. ప్రస్తుతం సంయుక్త మీనన్ సాయిధరమ్ తేజ్ సరసన విరూపాక్ష అనే చిత్రంలో నటిస్తోంది. తేజు బైక్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత చేస్తున్న చిత్రం ఇది. ప్రమాదానికి గురైన తర్వాత కూడా తేజు ఈ చిత్రంలో రిస్క్ తో కూడుకున్న బైక్ సన్నివేశాల్లో నటించారని ఇటీవల చిత్ర యూనిట్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
అలాగే టీజర్ కూడా విడుదలైంది. వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రతి ఒక్కరిని ఆసక్తి ఉంది. ఈ చిత్రాన్ని డెబ్యూ దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా సంయుక్త మీనన్ విరూపాక్ష చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్ర యూనిట్ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు అంటూ మండిపడింది. బుధవారం ఉగాది పర్వదినం సందర్భంగా చాలా చిత్రాల నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికరమైన పోస్టర్ వచ్చాయి.
విరూపాక్ష చిత్ర యూనిట్ కూడా సాయిధరమ్ తేజ్ స్టైలిష్ గా ఉన్న లుక్ రిలీజ్ చేసింది. కానీ సంయుక్త మీనన్ లుక్ కి సంబంధించిన ఎలాంటి పోస్టర్ రిలీజ్ చేయలేదు. దీనితో సంయుక్త మీనన్ తీవ్రంగా నిరాశకి గురైంది. నిర్మాణ సంస్థని తీరుని తప్పుబడుతూ ట్వీట్ చేసింది.
నేను చాలా డిసప్పాయింట్ గా ఉన్నా.. నా నిరాశని వ్యక్తం చేసే ముందు.. విరూపాక్ష చిత్రంలో.. గొప్ప నటులు, టెక్నీషియన్స్ తో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మెమొరీస్ ఎప్పటికి గుర్తు పెట్టుకుంటా.
కానీ శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంది ? నా క్యారెక్టర్ పోస్టర్ ని ఉగాది రోజు రిలీజ్ చేస్తారని మాట ఇచ్చారు.. ఆ పోస్టర్ ఏది ? అంటూ సంయుక్త నిలదీసింది. వెంటనే స్పందించిన నిర్మాణ సంస్థ.. మేము సిన్సియర్ గా క్షమాపణలు కోరుతున్నాం. ఈ సమస్యని పరిష్కరించేందుకు పోస్టర్ రిలీజ్ చేసేందుకు కొంత సమయం ఇవ్వండి అంటూ ఆమెకి రిప్లై ఇచ్చారు.

అయితే సంయుక్త నిజంగానే నిరాశకి గురైందా.. చిత్ర యూనిట్ మాట ఇచ్చి నిలబెట్టుకోకపోవడం వల్ల ఆమెకి కోపం వచ్చిందా ? లేక ఇదేమైనా ప్రమోషన్ లో భాగమా అనేది నెటిజన్లకు క్లారిటీ రావడం లేదు. సాయిధరమ్ తేజ్ కూడా ఈ వివాదంపై స్పందించలేదు.
