“మాచర్ల నియోజకవర్గం” నుంచి అదిరిపోయే అప్డేట్


ఈ పోస్టర్ లో నితిన్ లుక్ చాలా సీరియస్ గా కనిపిస్తుంది. ఇక ఈ పోస్టర్ షేర్ చేస్తూ.. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని.. వాల్యూమ్ పెంచండి.. మన నియోజకవర్గంకి ఎంటర్ అవ్వండి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. 

Samuthirakhani Dual Role For Macherla Niyojakavargam

రీసెంట్ గా ‘రంగ్ దే’, ‘చెక్’ సినిమాలతో పలకరించిన నితిన్.. తన తదుపరి చిత్రం ‘మాస్ట్రో’ సెప్టెంబరు 17 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా.. ఎం సుధాకర్ రెడ్డి మరియు నిఖిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నితిన్ తన కెరీర్ లో 31వ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ‘మాచర్ల నియోజకవర్గం’ టైటిల్ తో రూపొందనున్న  ఈ చిత్రం మోషన్ పోస్టర్ సైతం రీసెంట్ గా విడుదల చేసారు.

ఈ పోస్టర్ లో నితిన్ లుక్ చాలా సీరియస్ గా కనిపిస్తుంది. ఇక ఈ పోస్టర్ షేర్ చేస్తూ.. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని.. వాల్యూమ్ పెంచండి.. మన నియోజకవర్గంకి ఎంటర్ అవ్వండి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ చిత్రాన్ని ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి నటిస్తుండగా.. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై తెరకెక్కుతోంది.  ఇక ఈ టైటిల్ బట్టి చూస్తుంటే నితిన్ రాజకీయ నేపథ్యంలోనే వస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ ను షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం పై ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ ఇన్ఫో వినిపిస్తుంది. ఈ చిత్రంలో ప్రముఖ విలక్షణ నటుడు ‘సముద్రఖని’ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట.

అంతే కాకుండా తన రోల్ డ్యూయల్ రోల్ గా ఈ సినిమాలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఓ సినిమాలో సముద్రఖని రోల్ ఉంది అంటేనే ఎంతో కొంత స్పెషల్ ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు డ్యూయల్ రోల్ అంటున్నారు. మరి ఈ సినిమాలో మూవీ లవర్స్ లో ఎలాంటి ట్రీట్ ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా శ్రేష్ట్ మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios