మామ అల్లుళ్ళు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' చిత్రం జూలై 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వినోదయ సీతంకి రీమేక్.

మామ అల్లుళ్ళు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' చిత్రం జూలై 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వినోదయ సీతంకి రీమేక్. ఇది పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ఇద్దరి ఇమేజ్ కి భిన్నమైన చిత్రం అని చెప్పొచ్చు. ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా వారియర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

ఇప్పటికే ట్రైలర్స్, సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన బ్రో శ్లోకం యూట్యూబ్ లో దుమ్ములేపుతుంది. పాజిటివ్ బజ్ మధ్య బ్రో చిత్రం మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో రచ్చ చేసేందుకు సిద్ధం అవుతోంది. దీనితో ఆడియన్స్ లో జోష్ నింపే విధంగా నేడు హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సముద్ర ఖని అద్భుత ప్రసంగం చేశారు. తెలుగులోనే మాట్లాడుతూ తాను చెప్పాలనుకున్న విషయాన్ని అర్థం అయ్యేలా చేశారు. ఒక రోజు త్రివిక్రమ్ అన్న ఇంటికి వెళ్ళాను. అప్పుడే నాకు ఒక ఫోన్ వచ్చింది. అది మధురైలో ఒక డాన్ నుంచి. నేను చేసిన సినిమా చూసి ( వినోదయ సితం) చూసి ఏడుస్తూ ఫోన్ చేశారు. ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాడు. 

దీనితో త్రివిక్రమ్ అన్న ఎవరు ఫోన్ లో అని అడిగారు. కొన్ని రోజుల క్రితం నేను ఒక సినిమా చేశా. ఆ మూవీ చూసి ఏడుస్తూ మధురైలో ఒక డాన్ ఫోన్ చేసి ఏడుస్తున్నారు అని చెప్పా. ఆయన వయసు 60, 70 మధ్య ఉంటాయి. ఏంటి ఆ చిత్రం.. కథ ఏంటి అని త్రివిక్రమ్ అన్న అడిగారు. దీనితో నేను కథ చెప్పాను. చివర్లో ఒక డైలాగ్ చెప్పాను. స్వర్గంలో జాతి లేదు.. మతం లేదు.. మరి నరకంలో అంటే.. అక్కడి నుంచే కదా నిన్ను తీసుకుని వస్తున్నాం అని చెప్పాను. దీనితో త్రివిక్రమ్ అన్న ఎగ్జైట్ అయి మళ్ళీ చెప్పు అన్నారు. 

ఆయనకి కథ అంతబాగా నచ్చింది. ఈ కథని వేరేస్థాయికి తీసుకెళ్లాలి. పెద్ద హీరోతో చేయాలనుకుంటున్నా అని త్రివిక్రమ్ అన్నతో చెప్పా. పది నిమిషాల తర్వాత వచ్చి.. పవన్ కళ్యాణ్ గారితో చేస్తావా అని అడిగారు. వెంటనే ఎగిరి గంతేశా. అప్పుడే నా టైం వచ్చింది అని అనిపించింది. అప్పటి నుంచి నా టైం.. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురుచూశా. చివరకి ఆయన నుంచి పిలుపు వచ్చింది అని సముద్రఖని అన్నారు. 

 పవన్ కళ్యాణ్ గారు 70 రోజుల పనిని ఈ చిత్రం కోసం 21 రోజుల్లో పూర్తి చేశారు. అంతగా ఈ చిత్రం కోసం ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. ఈ జర్నీలో పవన్ కళ్యాణ్ గారిలో సమాజం పట్ల అవగాహన చూశా. ఆయన వెంట నడిచేందుకు నేను రెడీ అని సముద్ర ఖని అన్నారు.