కొబ్బరిమట్ట సినిమాతో మరోసారి డిఫరెంట్ హిట్ అందుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమాపై మరింత క్రేజ్ పెరిగే విధంగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే సినిమా పోస్టర్స్ తో సెటైర్ లు వేస్తూ చిన్న చిన్న ప్రమోషనల్ టీజర్స్ తో సినిమాకు క్రేజ్ వచ్చే విధంగా చేస్తున్న చిత్ర యూనిట్ ఇప్పుడు విజయ యాత్రల డోస్ పెంచింది.  

ఈ రోజే షెడ్యూల్ లో సంపూ ఆంధ్రప్రదేశ్ టూర్ స్టార్ట్ చేశాడు.  కర్నూలు, అనంతపూర్, ప్రొద్దుటూరూ ప్రాంతాలకు వెళ్లి అభిమానులను ప్రత్యేకంగా కలుసుకొని వారితో థియేటర్స్ లో సినిమాను వీక్షించనున్నారు. ఇక రేపు తిరుపతి మరియు నెల్లూరు వంటి ఏరియాల్లో కూడా విజయయాత్ర కొనసాగనున్నట్లు చెప్పిన సంపూ సినిమాకు ఇంతటి ఘానా విజయాన్ని అందించిన ప్రేక్షకులకు  ధన్యవాదాలు తెలిపాడు.