Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ :అసెంబ్లీ ముందు న‌గ్నంగా.. సంపూర్ణేష్ బాబు

 సంపూ న‌గ్నంగా క‌నిపించాడు. అయితే మ‌ధ్య‌లో క్యాలిఫ్ల‌వ‌రే అడ్డు. అసెంబ్లీ ముందు సంపూ న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌, క‌వ‌ర్ చేస్తున్న మీడియా ప్ర‌తినిథుల హంగామా.. కామెడీగా ఉంది. 

Sampoornesh babu cauliflower movie title poster released jsp
Author
Hyderabad, First Published Jul 3, 2021, 6:50 PM IST

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన‌ ‘కొబ్బరిమట్ట’ చిత్రాన్ని ప్రేక్షకులకు సూపర్‌హిట్‌ చేశారు. తాజాగా మరో కొత్త క్రేజీ కాన్సెప్ట్‌తో మరోసారి ప్రేక్షకులను ఆలరించడానికి రెడీ అయ్యారు సంపూర్ణేష్‌ బాబు. ‘క్యాలీ ఫ్లవర్‌’ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ముందుకు రానున్నారు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో హీరో క్యారెక్ట‌రైజేష‌న్ కూడా గ‌మ్మ‌త్తుగా ఉండ‌బోతోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఈ రోజు ఓ లుక్ విడుద‌ల చేశారు. అందులో సంపూ న‌గ్నంగా క‌నిపించాడు. అయితే మ‌ధ్య‌లో క్యాలిఫ్ల‌వ‌రే అడ్డు. అసెంబ్లీ ముందు సంపూ న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌, క‌వ‌ర్ చేస్తున్న మీడియా ప్ర‌తినిథుల హంగామా.. కామెడీగా ఉంది. 

మరోసారి సంపూ స్టైల్‌ ఆఫ్‌ కామెడీని ‘క్యాలీఫ్లవర్‌’ చిత్రంతో హాస్య ప్రియులు ఎంజాయ్‌ చేయనున్నార‌ని తెలుస్తోంది. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు. ఈ చిత్రంలో సంపూర్ణేష్‌బాబు సరసన వాసంతి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రజ్వల్‌ క్రిష్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ముజీర్‌ మాలిక్‌ ఛాయగ్రాహకుడు. ఎడిటింగ్‌ బాధ్యతలను బాబు నిర్వ హిస్తున్నారు. ఇదిలా ఉంటే సంపూర్నేష్‌బాబు లుక్‌ చూస్తేంటే `పీకే` చిత్రంలో ఆమిర్‌ ఖాన్‌ లుక్‌ని కాపీ కొట్టినట్టుంది.

నటీనటులు: సంపూర్ణేష్‌బాబు, వాసంతి, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, నాగ మహేశ్, గెటప్‌ శీను, రోహిని, కాదంబరి కిరణ్, కల్లు కృష్ణారావు, విజయ్, కల్యాణీ, సుమన్‌ మనవ్వాద్, ముస్కాన్, బేబీ సహృద, రమణ్‌ దీప్‌

సాంకేతిక నిపుణులు
స్క్రీన్‌ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఆర్కే మలినేని
ప్రొడ్యూసర్‌: ఆశా జ్యోతి గోగినేని
బ్యానర్స్‌: మధుసూధన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి
సమర్పణ: శ్రీధర్‌ గుడూరు
స్టోరీ: గోపి కిరణ్‌
మ్యూజిక్‌ డైరెక్టర్‌: ప్రజ్వల్‌ క్రిష్‌
డీఓపీ: ముజీర్‌ మాలిక్‌
ఎడిటర్‌:బాబు
డైలాగ్స్‌: రైటర్‌ మోహన్, పరమతముని శివరామ్‌
పీఆర్ఒ: వంశీ–శేఖర్‌
 

Follow Us:
Download App:
  • android
  • ios