'రచ్చ' సినిమాలో మొదటిసారి తమన్నాని డైరెక్ట్ చేసిన దర్శకుడు సంపత్ నంది ఆ తరువాత 'బెంగాల్ టైగర్' సినిమాలో కూడా ఆమెని రిపీట్ చేశారు. ఆ సమయంలోతమన్నా 'బాహుబలి' సినిమా చేస్తుండడంతో భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది.

అయినప్పటికీ నిర్మాతలను ఒప్పించి మరీ తమన్నాను తీసుకున్నాడు సంపత్ నంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం తమన్నాకి డిమాండ్ బాగా తగ్గింది. ఆమె నటిస్తోన్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అయినప్పటికీ తమన్నాని మరోసారి తన సినిమా కోసం ఎంపిక చేసుకున్నాడు సంపత్ నంది. గోపీచంద్ హీరోగా సంపత్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'గౌతమ్ నంద' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. అందులో కూడా హీరోయిన్ గా తమన్నానే తీసుకోవాలని ప్లాన్ చేస్తుండడంతో.. ఆమె అంటే సంపత్ కి అంత పిచ్చి దేనికనే చర్చలు ఇండస్ట్రీలో జరుగుతున్నాయి.

త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం తమన్నా 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందనిపిస్తోంది. ట్రైలర్ లో, లిరికల్ వీడియోలో కూడా తమన్నా బాగా హైలైట్ అయింది. ఈ సినిమా రిలీజైన తరువాత తమన్నాకి అవకాశాలు పెరుగుతాయనే భావన చాలా మందిలో ఉంది.