సమ్మోహనం ట్విట్టర్ రివ్యూ

sammohanam movie twitter review
Highlights

బ్యూటిఫుల్ లవ్ స్టోరీ

ఇంద్రగంటి మోహన్ కృష్ణ నుంచి సినిమా వస్తోంది అంటే చాలు.. ప్రేక్షకులు  కొంచెం కొత్తదనాన్ని ఆశిస్తారు.  ఎందుకంటే రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా ఆయన సినిమాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. హీరోతోపాటు, హీరోయిన్ కి కూడా సామానంగా ప్రాధాన్యత ఉంటుంది. అష్టాచమ్మా, జెంటిల్ మెన్, అమితుమీ, అంతకముందు ఆ తర్వాత.. ఇవన్నీ అలాంటి సినిమాలే. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం సమ్మోహనం.

సుధీర్ బాబు, అదితీ రావు హైదరీ జంటగా నటిస్తున్న ఈ చిత్రం నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై  ఆసక్తి మరింత పెరిగింది. సినిమాలంటే అస్సలు ఇష్టం లేని అబ్బాయి.. సినిమాలే ప్రపంచంగా బ్రతికే అమ్మాయిల మధ్య ప్రేమ కథే ఈ సమ్మెహనం అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

సినిమా.. ఓ అందమైన ప్రపంచం ఆ అందమైన ప్రపంచంలో హీరోయిన్‌గా రాణించాలంటే ఎక్కడో ఒకచోట కాంప్రమైజ్ కావడం తప్పనిసరి అని భావించే వారికి సమాధానం ఈ ‘సమ్మోహనం’  అని ఇప్పటికే దర్శకుడు హింట్ ఇచ్చాడు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రేమికులు ప్రీమియర్ షోలు వీక్షించేశారు.
ట్విట్టర్ లో వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నారు.

వారి ట్వీట్స్ ప్రకారం సినిమాకి పాజిటివ్ టాక్ వినపడుతోంది. ఇంద్రగంటి డైరెక్షన్‌తో పాటు హీరో హీరోయిన్లు బాగా చేశారంటున్నారు. పి.జి.విందా ఫొటోగ్ర‌ఫీ హైలైట్‌గా ఉందని.. వివేక్ సాగ‌ర్ ట్యూన్లు ఆక‌ట్టుకుంటున్నాయంటున్నారు. టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగానే సినిమా మొత్తం అంద‌మైన ఫీల్ క్యారీ అయి స‌మ్మోహ‌నంగా అనిపిస్తుందంటున్నారు. మరొకొందరైతే సినిమా ఫ్రెష్ లుక్‌తో బాగుందని.. అయితే సెకండాఫ్ మరీ సాగదీసినట్లు ఉందంటూ పెదవి విరిస్తున్నారు.  పూర్తి స్థాయిలో సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే.. మరికొద్ది సేపు ఆగాల్సిందే. 

loader