టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన సమీరా రెడ్డి తమిళ, హిందీ చిత్రాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత తిరిగి మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంది.

కానీ అధిక బరువు కారణంగా తన ఆశలన్నీ తలకిందులు అయ్యాయని చెప్పుకొచ్చింది. బాబుకి జన్మనిచ్చిన తరువాత ఓ వ్యాధి కారణంగా ఐదు నెలల పాటు బెడ్ కే పరిమితం కావాల్సి వచ్చిందని.. ఇంట్లోనే ఉండడం వలన బరువు పెరిగిపోయాయని చెప్పుకొచ్చింది.

వర్కవుట్స్ చేయడానికి వీలు లేకపోవడంతో ఏకంగా 102 కేజీల బరువు పెరిగినట్లు చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఎప్పుడైనా బయటకి వెళితే తనపై కామెంట్స్ చేసుకొని నవ్వేవారని.. అవి తనను బాధకు గురి చేసినట్లు చెప్పింది.

ఆ కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు, వైద్యుల సహాయంతో బయటపడినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గర్భవతి అయిన తను బిడ్డకు జన్మనిచ్చిన తరువాత మునుపటి  రూపంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించింది.