హీరోయిన్ సమీరా రెడ్డి ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. రెండవ కాన్పులో సమీరాకు కుమార్తె జన్మించింది. దీనితో సమీరా రెడ్డి, అక్షయ్ వర్దె దంపతులు సంతోషంలో మునిగిపోయారు. ఇప్పటికే సమీరాకు ఓ కొడుకు ఉన్నాడు. తాజాగా సమీరా రెడ్డి తన కుమార్తెకు నామకరణం చేసింది. 

బుజ్జి పాపాయికి 'నైరా' అని పేరు పెట్టింది. ఈ విషయాన్ని సమీరా రెడ్డి సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. సమీరా రెడ్డి, ఆమె కొడుకు హాన్స్ వర్దె చిరునవ్వులు చిందిస్తూ నైరా అనే పేరున్న పేపర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పేరు చాలా ట్రెండీగా ఉందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. 

సమీరా రెడ్డి 2014లో వ్యాపారవేత్త అయిన అక్షయ్ వర్దె ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె సినిమాలు దూరమైన సంగతి తెలిసిందే. తెలుగులో సమీరా రెడ్డి జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి లతో నటించింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Welcoming our lil lady to the the Varde family, baby girl ‘Nyra’ 💕 . . #blessed #grace #love #family 🙌🏻

A post shared by Sameera Reddy (@reddysameera) on Jul 30, 2019 at 11:44pm PDT