రైతు భార్యగా సమంత.. రంగస్థలం కోసం గేదెలతో పాట్లు

First Published 11, Dec 2017, 2:50 PM IST
samantha working hard for rangasthalam with bufellows
Highlights
  • రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న సమంత
  • సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ
  • మార్చి 30న రిలీజ్ కానున్న రంగస్థలం 1985 మూవీలో  గేదెలతో సమంత

తెలుగు సినీ దర్శకుల్లో సుకుమార్ క్రియేటివిటీ ఏంటో తెలిసిందే. తనదైన శైలిలో లాజికల్ పాయింట్ ఎంచుకుని దానికి పర్ ఫెక్ట్ ఎండింగ్ ఇవ్వటంలో సుకుమార్ టాలెంట్ తో మరెవరూ సాటి రారు. తాజాగా సుకుమార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో సమంత హిరోయిన్. ఇప్పుడు సుకుమార్ తన ఆలోచనని సమంత - రామ్ చరణ్ లపై ప్రయోగిస్తున్నాడు. ఈ దర్శకుడి గత సినిమాలు ఏ తరహాలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న రంగస్థలం సినిమా కూడా చాలా కొత్తగా ఉందని పోస్టర్లే చెబుతున్నాయి. మొన్న రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఊర మాస్ లుక్కులో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన కొన్ని ఫొటోస్ లలో సమంత మాత్రం ఎవరు కలలో కూడా ఊహించని రేంజ్ లో కనిపిస్తోంది.
 

పల్లెటూరిలో రైతు కుటుంబానికి చెందిన అమ్మాయిలు పొలాల వద్ద ఎలాంటి పనులు చేస్తారో అలాంటి పనులను చేస్తూ కనిపించింది. గేదెలను తీసుకువస్తూ.. కట్టెల పొయ్యి వద్ద వంట చేస్తూ చాలా కొత్తగా కనిపించింది. దర్శకుడు సుకుమార్ సమంత ని చాలా కష్టపెట్టినట్లు తెలుస్తోంది. ఫోటోలను చూసి ఆమె ఫ్యాన్స్.. అయ్యో సమంతకి ఎంత కష్టమొచ్చిందో అని కొన్ని కామెంట్స్ చేస్తున్నారు.

 

మరోవైపు ఈ పిక్స్ చూసి రామ్ చరణ్ రైతు పాత్రలో, సమంత రైతు భార్య పాత్రలో నటిస్తోందని సోషల్ మీడియాలో టాపిక్స్ వైరల్ అవుతున్నాయి.

loader