కాశ్మీర్‌లో షూటింగ్ నేపథ్యంలో అక్కడ కూడా సమంత వర్కౌట్ చేస్తుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె పలు వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అభిమానులతో పంచుకుంది. అయితే అక్కడ ఒంటరిగా కాకుండా మరో వ్యక్తితో కలిసి జిమ్ చేస్తుండటం విశేషం.
సమంత(Samantha) ఫిట్‌నెస్ విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. ఆమె ఫిట్‌నెస్‌కి సంబంధించి తోటి హీరోయిన్లకి ఆదర్శంగానూ నిలుస్తుంది. తన బాడీని ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉంచుకోవడంలో ఆమె ముందుంటుంది. దానికోసం క్రమం తప్పకుండా వర్కౌట్ చేస్తుంది సమంత. ఈ విషయంలో రాజీపడేదేలేదు. ఎక్కడ ఉన్నా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వర్కౌట్స్ చేయాల్సిందే. అందుకు నిదర్శనమే ఆమె పంచుకున్న వర్కౌట్ వీడియోలు. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
సమంత ప్రస్తుతం కాశ్మీర్‌లో ఉంది. విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తో కలిసి ఆమె `VD11`(వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కాశ్మీర్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మంచి ఫ్యామిలీ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు శివ నిర్వాణ. ఆయన చిత్రంలో ఎమోషన్స్ హైలైట్‌గా నిలుస్తుంటాయి. ఇందులోనూ అవే హైలైట్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
కాశ్మీర్‌లో షూటింగ్ నేపథ్యంలో అక్కడ కూడా సమంత వర్కౌట్ చేస్తుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె పలు వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అభిమానులతో పంచుకుంది. అయితే అక్కడ ఒంటరిగా కాకుండా మరో వ్యక్తితో కలిసి జిమ్ చేస్తుండటం విశేషం. మరి ఆమెతోపాటు జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో అతనెవరో రివీల్ చేసింది సమంత. తన వ్యక్తిగత అసిస్టెంట్ అర్యన్ దగ్గుబాటితోకలిసి ఆమె జిమ్‌లో కష్టపడుతోంది. అతన్ని శ్రమపెడుతుంది. అయితే ఈ సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. `కలిసి పనిచేస్తే కుటుంబం కలిసి ఉంటుంది` అని పేర్కొంది. ఈ సందర్భంగా అర్యన్‌ని ట్యాగ్ చేసింది.
మరోవైపు జిమ్‌లో ఆమె వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియోని పంచుకుంది. ఇందులో చాలా బరువైన వెయిట్‌ని లిఫ్ట్ చేస్తుండటం ఆకట్టుకుంటుంది. చాలా కష్టమైనప్పటికీ దాన్ని చేసింది సమంత. అయితే ట్రైనర్‌సమక్షంలోనే ఆమె ఈ వెయిట్‌ని లిఫ్ట్ చేసి అభిమానులతో శెభాష్ అనిపించుకుంటుంది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న `వీడీ11` చిత్రం నుంచి కాసేపట్లో(సోమవారం 9గంటలకు) ఫస్ట్ లుక్ రాబోతుంది. దీంతోపాటు టైటిల్ కూడా కన్ఫమ్ చేసే అవకాశాలున్నాయి.
