Asianet News TeluguAsianet News Telugu

Samantha:ది ఫ్యామిలీ మాన్ దర్శకులతో సమంత వెబ్ సిరీస్... రోల్ కోసం జిమ్ లో చెమటలు చిందిస్తున్న అమ్మడు?

రాజ్ & డీకే (Raj & DK) లతో సమంత మరో సిరీస్ చేయనున్నారట. ఈ సిరీస్ కోసం సమంత తన లుక్ కూడా పూర్తిగా చేంజ్ చేయనున్నారట. ఆ పాత్రకు తగ్గ లుక్ రాబట్టడానికి సమంత కఠిన కసరత్తులు చేస్తున్నారట. 

samantha will join hands with family man director for a new web series
Author
Hyderabad, First Published Jan 17, 2022, 10:47 AM IST

సమంత (Samantha) తన ఫోకస్ బాలీవుడ్ కి షిఫ్ట్ చేసినట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. స్టార్ హీరోయిన్ గా సౌత్ ని ఏలేసిన సమంత బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని ప్రణాళికలు వేస్తున్నారట. దాని కోసం వరుసగా హిందీ ప్రాజెక్ట్స్ చేయాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారట. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ తో సమంత అడుగు అక్కడ ఆల్రెడీ పడింది. దర్శక ద్వయం రాజ్ & డీకే తెరకెక్కించిన ఈ సిరీస్లో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయం విశేషం. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ సూపర్ సక్సెస్ అందుకుంది. బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ సమంత నటనకు ఫిదా అయ్యారు. 

కాగా రాజ్ & డీకే (Raj & DK) లతో సమంత మరో సిరీస్ చేయనున్నారట. ఈ సిరీస్ కోసం సమంత తన లుక్ కూడా పూర్తిగా చేంజ్ చేయనున్నారట. ఆ పాత్రకు తగ్గ లుక్ రాబట్టడానికి సమంత కఠిన కసరత్తులు చేస్తున్నారట. అదే సమయంలో సమంత భారీ పారితోషికంగా కూడా తీసుకుంటున్నారట. హాలీవుడ్ సక్సెస్ ఫుల్ సిరీస్ సిటాడెల్ రీమేక్ లో సమంత నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది ఇదేనా లేక మరో ప్రాజెక్టా అనేది తెలియాల్సి ఉంది. 

అలాగే బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సమంతతో ఏకంగా మూడు ప్రాజెక్ట్స్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారట. అధికారిక సమాచారం రావాల్సి ఉండగా.. ఈ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థతో సమంత పనిచేయనున్నారట. బాలీవుడ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కాయి. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థతో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టం. 

ప్రస్తుతానికి సమంత యశోద మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. యశోద పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. అలాగే దర్శకుడు గుణశేఖర్ మైథలాజికల్ చిత్రంగా శాకుంతలం తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తి కావడం జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఈ ఏడాది విడుదల కానుంది. నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాతు వాకుల రెండు కాదల్ చిత్రంలో సమంత నటిస్తున్నారు. 
యశోద, శాకుంతలం హిందీలో కూడా విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాల పలితాలతో సంబంధం లేకుండా సమంత అక్కడ దూసుకుపోవడం ఖాయం. ఆమె ఎక్కడ కాలుపెడితే అక్కడ కనక వర్షమే. ది ఫ్యామిలీ మాన్ 2 సక్సెస్ తో అది మరోసారి నిరూపించింది. కాగా నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తన పూర్తి దృష్టి కెరీర్ పై కేంద్రీకరించారు. దేశవ్యాప్తంగా ఫేమ్ తెచ్చుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. 

కాగా సమంతతో విడాకుల విషయంపై నాగ చైతన్య తొలిసారి స్పందించారు. బంగార్రాజు ప్రమోషన్స్ లో భాగంగా.. మీడియా సమావేశంలో పాల్గొన్న నాగ చైతన్య.. విడాకుల నిర్ణయం ఇద్దరిది. పరస్పరం అంగీకారంతో తీసుకున్న నిర్ణయం, కాబట్టి ఎవరినీ ఇది బాధపెట్టలేదు. విడాకుల వలన డిప్రెషన్ లాంటి సమస్యలు లేవని ఓపెన్ అయ్యాడు. మరి ఇప్పటికే థర్టీ ప్లస్ లో ఉన్న చైతూ, సమంత తమకు నచ్చిన భాగస్వాములను ఎప్పుడు పెళ్ళిచేసుంటారో చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios