దక్షినాది స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. ఈ ఏడాదిలో నాలుగు విజయాలను అందుకొని టాప్ రేసులో దూసుకుపోతుంది. 'యూటర్న్' సినిమాకి విమర్శల ప్రసంశలు దక్కడంతో అమ్మడు సంతోషంలో మునిగిపోతుంది.

తన భర్త నాగచైతన్యతో కలిసి విదేశాల్లో షికారు చేస్తోంది. అక్కడ హాలిడే ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అయితే ఆమె వేసుకున్న దుస్తుల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అక్కినేని ఇంటి కోడలిగా ఉన్న నువ్వు ఇలా  కురచ  దుస్తులు ధరించడానికి సిగ్గుగా లేదా..? అంటూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు. 

కొందరు మాత్రం సమంతకి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్ పై స్పందించిన సమంత దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. ''నేను వైవాహిక జీవితంలో ఎలా బతకాలో చెబుతున్నామని అనుకుంటున్న మీ అందరికీ'' అంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఓ సింబల్ ని పెట్టింది.

సమంత ఇచ్చిన సమాధానాన్ని కొందరు అభినందిస్తుండగా.. మరికొందరు మాత్రం మళ్లీ ఆమెని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. 

సంబంధిత వార్త.. 

పెళ్లైనా.. ఈ బట్టలేంటి..? సమంతపై నెటిజన్లు ఫైర్!