హీరోయిన్స్ జీవితం పెళ్లి తరువాత ఒక్కసారిగా మారిపోతుంది అనేది ఒకప్పటి మాట. సమంత లాంటి స్టార్ హీరోయిన్ అందుకు కొత్త అర్దాన్ని చెబుతోంది. ఈ బ్యూటీ అక్కినేని వారి కోడలు అయ్యాక వ్యక్తిగతంగాను అలాగే నటిగా ఎన్నో కొత్త తరహా అడుగులు వేసింది. అయితే సమంత ప్రతి ఏడాది ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకోవడం అలవాటుగా చేసుకుంటోంది. 

ఇప్పుడు మరో నిర్ణయంతో అమ్మడు నాన్ వెజ్ ప్రియులకు షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఓన్లీ వెజిటేరియన్ గా ఉండాలని ఏ మాంసాహారాన్ని తీసుకోవద్దని తనకు తాను సమంత ఛాలెంజింగ్ తీసుకుంది. ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సమంత తల్లి కారణమట. చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పిన కొన్ని మంచి మాటలని మరచిపోకుండా పాటించాలని సమంత బలంగా ఒక నిర్ణయం తీసుకుంది. 

అందులో భాగంగానే ముక్కకు గుడ్ బై చెప్పేసింది. ఇక ప్రస్తుతం సమంత నాగ చైతన్యతో మజిలీ అనే ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే,. నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.