తన పర్సనల్ విషయాల్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునే సమంత రీసెంట్ గా నాగచైతన్య రేర్ జిమ్ వీడియోతో పాటు తన జిమ్ వర్కవుట్ వీడియో పోస్ట్ వెయిట్ లిఫ్టింగ్ వర్కవుట్ వీడియో పోస్ట్ చేసేందుకు చైతూను కష్టపడి ఒప్పించానన్న సామ్

సోషల్ మీడియాలో సమంత ఎంత యాక్టీవ్‌గా ఉంటుందో మనందరికీ తెలుసు. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సమంత అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. దీనికి పూర్తి భిన్నంగా చైతూ ఉంటాడు. అయితే ఇటీవల నాగచైతన్య, సమంత ఇద్దరూ కలిసి జిమ్ కు వెళ్లారు. అక్కడ చాలా ఫీట్లే చేశారు. ఆ సమయంలో ఫోటోలు, వీడియోలు తీశారు. దీనికి సంబంధించిన ఫోటో, వీడియోలు సమంత ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాజాగా జిమ్‌లో చైతన్య వర్కవుట్‌కు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేసింది సమంత. సాధారణంగా తనకు సంబంధించిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ బయటకు రావడానికి ఇష్టపడని చైతూ.. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి తొలుత ససేమిరా అన్నాడట. అయితే సమంత మాత్రం చైతును చాలా బలవంతం చేసి, బతిమాలి చివరికి ఒప్పించిందట.

చైతన్య ఒప్పుకోవడమే ఆలస్యం.. తాను, చైతన్య జిమ్‌లో చేసిన వర్కవుట్‌కు సంబంధించి రెండు వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేసింది. ఈ వీడియోల్లో చైతన్య 161 కేజీల బరువును ఎత్తగా, సమంత 90 కేజీల బరువును ఎత్తేసింది. ఏదేమైనా ఫిట్‌నెస్ కోసం ఈ జంట చాలానే కష్టపడుతోంది.

Scroll to load tweet…