- Home
- Entertainment
- అమ్మాయిల మనసు దోచిన ఈ చాక్లెట్ బాయ్ ని గుర్తుపట్టారా? ఆర్మీలో చేరాల్సిన వ్యక్తి పెద్ద హీరో అయ్యారు
అమ్మాయిల మనసు దోచిన ఈ చాక్లెట్ బాయ్ ని గుర్తుపట్టారా? ఆర్మీలో చేరాల్సిన వ్యక్తి పెద్ద హీరో అయ్యారు
గ్లామర్ ప్రపంచంలో హీరోలు, హీరోయిన్ల జీవితాల వెనుక మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన కోణాలు ఉంటాయి. టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఒక వర్సటైల్ యాక్టర్ ఫోటో ఇది. కనిపిస్తున్న హీరోను గుర్తు పట్టారా?

ఆర్మీలోకి వెళ్లాలనే బలమైన కోరిక
దశాబ్దాలుగా వెండితెరపై ప్రేమికుడిగా, విలన్‌గా, పవర్‌ఫుల్ పాత్రలతో మెప్పిస్తున్న ఆ నటుడే ఆర్. మాధవన్ (మ్యాడీ). మాధవన్ చిన్నతనంలో సినిమా నటుడు కావాలని అసలు అనుకోలేదు. భారతీయ సైన్యంలో (Indian Army) చేరి దేశానికి సేవ చేయాలనేది ఆయన చిన్ననాటి కల. తన లక్ష్య సాధన కోసం కళాశాల రోజుల్లోనే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో చేరి చాలా చురుగ్గా పాల్గొనేవారు. ఎన్‌సిసిలో ప్రతిభ కనబరిచి మహారాష్ట్ర నుంచి ఉత్తమ క్యాండెట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా, ఇంగ్లాండ్‌కు వెళ్లి బ్రిటిష్ ఆర్మీ, రాయల్ నేవీ, రాయల్ ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో కఠినమైన శిక్షణ పొందే అరుదైన అవకాశాన్ని కూడా సాధించారు.
సినిమా ప్రయాణం ఎలా మొదలయ్యిందంటే?
ఇండియన్ ఆర్మీలో చేరడానికి అవసరమైన అన్ని రకాల అర్హత పరీక్షలలో మాధవన్ సక్సెస్ ఫుల్ గా పాస్ అయ్యాడు. కానీ దురదృష్టవశాత్తూ, వయస్సు పరిమితి నిబంధనల వల్ల ఆయనకు ఆర్మీలో చేరే అవకాశం కొద్దిలో చేజారిపోయింది. దాంతో తన ఆశయానికి బ్రేక్ పడినప్పటికీ, అధైర్యపడకుండా ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేశారు.
అమ్మాయిల మనసు దోచిన 'చాక్లేట్ బాయ్'
1990లలో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మాధవన్, మొదట్లో రొమాంటిక్ సినిమాలతో అమ్మాయిల మనసు దోచుకున్నాడు. తన స్టైలిష్ లుక్స్, నేచురల్ నటనతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘చాక్లేట్ బాయ్’గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో నటించి అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
రీల్ లైఫ్‌లో నెరవేరిన కల
నిజ జీవితంలో నెరవేరని ఆర్మీ అధికారి కలను ఆయన వెండితెరపై సాకారం చేసుకున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' - 'ధురంధర్ ది రివేంజ్' చిత్రాలలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ స్ఫూర్తితో రూపొందించిన ఐబీ చీఫ్ ‘అజయ్ సన్యాల్’ పాత్రను అద్భుతంగా పోషించి మెప్పించారు. రెండు భాగాలుగా వచ్చి బాక్సాఫీస్ వద్ద రూ. 3000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సిరీస్‌లో ఆయన నటన ప్రేక్షకుల నుంచి విపరీతమైన మెప్పు పొందింది.
ప్రస్తుతం రెగ్యులర్ కమర్షియల్ పాత్రలకు దూరంగా ఉంటూ విలన్, సైకలాజికల్ థ్రిల్లర్ పాత్రలతో వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. దేశానికి సేవ చేయాలనుకున్న ఒక యువకుడు, ఈరోజు భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుడిగా ఎదగడం నిజంగా విశేషం.