సమంతకి ఇటీవల కాలంలో మంచి యాక్షన్‌ సినిమా చూసిన ఫీలింగ్‌ కలిగిందట. `వైల్డ్‌ డాగ్‌` చూశాక ఆమె రివ్యూ పెట్టింది. ట్విట్టర్‌లో సినిమా చూశాక కలిగిన ఫీలింగ్‌ని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతుంది. 

నాగార్జున నటించిన `వైల్డ్ డాగ్‌` చిత్రం శుక్రవారం విడుదలై మిశ్రమ స్పందనని రాబట్టుకుంటోంది. కానీ అక్కినేని కోడలు, స్టార్‌ హీరోయిన్‌ సమంతకి మాత్రం `వైల్డ్ డాగ్‌` బాగా నచ్చిందట. ఇటీవల కాలంలో మంచి యాక్షన్‌ సినిమా చూసిన ఫీలింగ్‌ కలిగిందట. ఈ సినిమా చూశాక ఆమె రివ్యూ పెట్టింది. ట్విట్టర్‌లో సినిమా చూశాక కలిగిన ఫీలింగ్‌ని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతుంది. మరి ఇంతకి ఏం చెప్పిందంటే?

``వైల్డ్ డాగ్‌` సినిమా చూశా. ఇది ఫాంటాస్టిక్‌గా ఉంది. నిజంగా నేను ఇటీవల మంచి యాక్షన్‌ చిత్రాలు మిస్‌ అవుతున్నా ఫీలింగ్‌ కలిగింది. ఆ లోటుని ఈ సినిమా తీర్చింది. ఎమోషనల్‌, యాక్షన్‌తో హాలీవుడ్‌ స్టయిల్‌లో ఈ సినిమా ఉంది. ఏసీపీ విజయ్‌వర్మ పాత్రను నాగార్జున తప్ప మరెవ్వరు చేయలేరు` అని పేర్కొంది సమంత. మొత్తంగా మామ సినిమాని ఆకాశానికి ఎత్తింది సమంత. 

Scroll to load tweet…

అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన `వైల్ డాగ్‌` చిత్రంపై ఆడియెన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఇది కలెక్షన్ల పరంగానూ ఇది అంతగా ఆకట్టుకోలేదనే టాక్‌ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే శనివారం చిత్ర యూనిట్‌ సక్సెస్‌ సెలబ్రేట్‌ చేశారు. ఇందులో కేక్‌ కట్‌ చేసి టీమ్‌ సెలబ్రేట్‌ చేసుకోవడం విశేషం. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సినిమాని నిర్మించారు.