టాలీవుడ్ లో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది.అదేమిటంటే సమంత నిర్మాతగా కూడా మారారట. ఓ యువ హీరో ప్రాజెక్ట్ కి ఆమె రూ. 5 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి సిద్ధం అయ్యారని సదరు వార్తల సారాంశం. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి హీరో సుధీర్ బాబుతో ఓ మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం అయ్యింది. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. 

కాగా ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా సమంత మారనున్నారట. ఈ ప్రాజెక్ట్ లో ఆమె రూ. 5కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నారట. అయితే ఆమె ఈ ప్రాజెక్ట్ కి స్లీపింగ్ పార్టనర్ అని తెలుస్తుంది. తన సినిమాలు, ప్రోగ్రామ్స్ చూసుకుంటూనే సుధీర్ మూవీకి నిర్మాతగా సమంత వ్యవహరిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. 

మరోవైపు సమంత దర్శకుడు గుణశేఖర్ తో భారీ పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. శాకుంతలం పేరుతో తెరకెక్కనున్న ఈ మూవీ తెలుగుతో పాటు దేశంలోని అన్ని ప్రధాన భాషలలో విడుదల కానుంది. అలాగే సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 విడుదలకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది. ఫ్యామిలీ మాన్ 2 టీజర్ విడుదల చేయగా అందులో సమంత లుక్ కొత్తగా ఉంది.