Asianet News TeluguAsianet News Telugu

నానితో మరోసారి రొమాన్స్ చేయనుందా..?

'ఎటో వెళ్లిపోయింది మనసు' చిత్రంలో నానితో కలిసి నటించి తెరపై రొమాన్స్ ఓ రేంజ్ లో పండించిన సమంత అంతకముందే అతడితో 'ఈగ' సినిమాలో కలిసి నటించింది. 

samantha to pair up with nani
Author
Hyderabad, First Published Apr 1, 2019, 5:04 PM IST

'ఎటో వెళ్లిపోయింది మనసు' చిత్రంలో నానితో కలిసి నటించి తెరపై రొమాన్స్ ఓ రేంజ్ లో పండించిన సమంత అంతకముందే అతడితో 'ఈగ' సినిమాలో కలిసి నటించింది. ఇప్పుడు మరోసారి అతడితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి సై అందని టాక్.

నాని, సుదీర్ బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాకి 'వ్యూహం' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా సమంతను తీసుకోవాలని భావిస్తున్నారు.

అయితే ఈ విషయంపై ఆమె ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని సమాచారం. సమంత గనుక ఒప్పుకుంటే ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా అవుతుంది. కథ ప్రకారం సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే సినిమాకు సంబంధించిన వివరాలు అధికారికంగా తెలియనున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios