మన్మధుడు సినిమా...నాగ్ హీరో ...ఇందులో సమంత అంటే ఊహించటం కష్టం. ఎందుకంటే నాగ్ ఇప్పుడు ఆమెకు గౌరవనీయమైన మామగారు. దాంతో ఆయన సినిమాలో రొమాంటిక్ పెయిర్ గా కనిపించటం అనేది కష్టం. మరి మన్మధుడు 2లో ఆమె కనిపిస్తే బాగుంటుందని దర్శకుడు ఆలోచన. అందుకు సమంత కూడా సై అందిట. అయితే మరి సమంత చేసే పాత్ర ఏమిటి అంటే...ఆయనకు కూతురు పాత్ర అని తెలుస్తోంది. 

ఈ సినిమాలో కీలక సన్నివేశాల్లో వచ్చే పాత్రలో సమంత కనిపించనున్నారని టాక్‌.  కేవలం ఐదు నుంచి పది  నిమిషాలు మాత్రమే ఆమె కనిపిస్తారట. ‘రాజుగారి గది 2’లో నాగార్జున, సమంత నటించిన విషయం తెలిసిందే. ఈ నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ కానున్న ఈ చిత్రం షూటింగ్‌ ఎక్కువ శాతం షూటింగ్‌ పోర్చుగల్‌లో జరగనుంది. ఇందులో నాగార్జున భార్యగా రకుల్‌ నటించనున్నారని సమాచారం.

ఇక ఆడవాళ్ళను అసహ్యించుకునే స్ట్రిక్ట్‌ బాస్‌లా ‘మన్మథుడు’ సినిమాలో కనిపించి,నవ్వించిన  నాగార్జున  ను మర్చిపోవటం కష్టమే. ఆ సినిమాలో నాగ్ పంచిన కామెడీ ఎవర్‌ గ్రీన్‌ అనటంలో సందేహం లేదు. ఇప్పటికీ ఏదో ఒక ఛానెల్ లో ఆ సీన్స్ వస్తే అతుక్కుపోతూంటాం. ఆ సినిమాలోని పంచ్‌ డైలాగ్స్‌ ఫ్రెష్‌గానే పేలుతాయి.

అయితే  లేటెస్ట్‌గా మన్మథుడు మళ్లీ  రావడానికి ముహూర్తం పెట్టుకున్నారు.   2002లో నాగార్జున హీరోగా విజయ భాస్కర్‌ రూపొందించిన చిత్రం ‘మన్మథుడు’కు సినిమాకు సీక్వెల్‌ రూపొందనుంది. దర్శకుడిగా మారిన హీరో రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున నిర్మించనున్నారు ఈ చిత్రంలో హీరోయిన్‌గా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను ఎంపిక చేశారట. ఈ సీక్వెల్‌లో ‘మన్మథుడు’ క్యారెక్టరైజేషన్‌ను మాత్రమే తీసుకుంటారా? లేక వేరే కథను ప్లాన్‌ చేశారా? వేచి చూడాలి.