లేడీ ఓరియెంటెడ్ మూవీలో గ్లామర్ డాల్ సమంత

samantha to act in lady oriented film
Highlights

  • సౌత్ లో క్రేజీ హీరోయిన్స్ లో ముందున్న సమంత
  • నాగచైతన్యతో వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానన్న సమంత
  • తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి సైన్ చేసిన సమంత

హిరోయిన్ సమంతకు దక్షిణాదిలో ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామరస్ రోల్స్ తో పాటు.. తన క్యూట్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత ఇటీవలే అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుంది. ప్రస్థుతం వివాహానంతరం తిరిగి షూటింగుల్లో పాల్గొంటున్న సమంత.. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించినా..  మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో మాత్రం నటించలేదు.

 

తాజాగా సమంత తొలిసారి ఫీమేల్ ఓరియెంటెడ్ రోల్ వున్న సినిమాకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. కన్నడ మిస్టరీ ‘యుటర్న్‌’లో నటించేందుకు సమంత సిద్ధమైందని సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన పవన్‌కుమార్‌ ఈ రీమేక్‌ను కూడా తెరకెక్కించనున్నారట.

 

సమంత ‘యుటర్న్‌’ ప్రివ్యూ కట్‌ చూడటానికి తన భర్త నాగచైతన్యతో కలిసి ఇటీవల బెంగళూరు వెళ్లిందట. అప్పుడే దర్శకుడితో రీమేక్‌ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇందులో సమంత జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారట. యుటర్న్ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్‌, రోగర్‌ నారాయణ్‌, దిలీప్‌ రాజ్‌, రాధికా చేతన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. 2016లో ఈ సినిమా విడుదలైంది.

 

సమంత ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘రంగస్థలం 1985’లో నటిస్తోంది. దీంతోపాటు మహానటి సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’లో కీలకమైన జమున పాత్ర పోషిస్తోంది. తమిళ హీరో విశాల్‌ సరసన ‘అభిమన్యుడు’ సినిమాలోనూ నటిస్తోంది. శివకార్తీకేయన్‌ సరసన కూడా నటిస్తోంది.

loader