అంతకుముందు.. ఆ తరువాత అనే పదం సమంతకు కరెక్ట్ గా సెట్టవుతుంది. పెళ్లయిన తరువాత హీరోయిన్స్ కెరీర్ క్లోజ్ అవుతుంది అనే ట్యాగ్ ను తీసిపారేసిన సమంత అక్కినేని వారి కోడలు అయ్యాక ప్రయోగాత్మక సినిమాలతో మరింత జోరు పెంచింది. గ్లామర్ అవసరమయిన చోటే ప్రజెంట్ చేస్తూ డిఫరెంట్ యాంగిల్ లో దర్శనమిస్తోంది. 

అసలు మ్యాటర్ లోకి వస్తే సమంత నుంచి నెక్స్ట్ రాబోతున్న ఒక సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. సూపర్ డీలక్స్ అనే సినిమా తమిళ్ లో శుక్రవారం రిలీజ్ కానుంది. వాయిలెన్స్ - సెక్సువల్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. 

పెళ్లయిన వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకొని భర్తను చంపే మహిళగా సమంత నటించినట్లు తెలుస్తోంది. ఇక హిజ్రా పాత్రలో విజయ్ సేతుపతి నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. రమ్యకృష్ణ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఇక సినిమా రిజల్ట్ ను బట్టి తెలుగులో కూడా డబ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.