Asianet News TeluguAsianet News Telugu

చైతూ పుట్టినరోజును స్పెషల్ గా ప్లాన్ చేసిన సమంత

  • నాగ చైతన్య పుట్టినరోజు వేడుకల కోసం సెలవు పెట్టిన సమంత
  • ప్రస్థుతం సినిమా షూటింగులతో బిజీ బిజీగా చై సామ్
  • చైతూ పుట్టినరోజు కోసం సెలవుపెట్టి స్పెషల్ గా ప్లాన్ చేస్తున్న సమంత
samantha special plans for chatanya birthday

నాగచైతన్య పెళ్లి తర్వాత త్వరలోనే తన ఫస్ట్ బర్త్ డే జరుపుకోనున్నాడు. చైతూ కోసం కొత్త పెళ్లి కూతురు సమంత స్పెషల్ గా ప్లాన్స్ వేస్తోంది. తన భర్తకు కలకాలం గుర్తుండిపోయేలా ట్రీట్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈమధ్యే సమంత నటిస్తున్న కొత్త సినిమా షెడ్యూల్ ప్రారంభమైంది. అయితే చైతూ పుట్టినరోజు సందర్భంగా రేపు ఒక్కరోజు ఈ షూటింగ్ కు సెలవు పెట్టింది సమంత. రేపంతా నాగచైతన్యతోనే గడపాలని నిర్ణయించుకుంది. నిజానికి పెళ్లిరోజులా ఈ పుట్టినరోజును కూడా డెస్టినేషన్ బర్త్ డే గా ప్లాన్ చేసింది ఈ జంట. ఎక్కడికైనా ఓ మంచి ప్రదేశానికి వెళ్లిపోయి జాలీగా సెలిబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. 

 

అయితే ప్రస్థుతం సమంత, నాగచైతన్య ఇద్దరూ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. సమంత చేతిలో 3 సినిమాలుంటే, సవ్యసాచి షూటింగ్ తో చైతూ కూడా బిజీగా ఉన్నాడు. సో.. ఈ స్పెషల్ బర్త్ డేను హైదరాబాద్ లోనే సెలబ్రేట్ చేసుకోవాలని వీళ్లిద్దరూ నిర్ణయించారు.

 

చైతూ కోసం సమంత ప్లాన్ చేసిన ఆ సర్ ప్రైజ్ ఏంటనే విషయం సెలియాలంటే సమంత సోషల్ మీడియా ఎకౌంట్స్ ఫాలో అయితే సరి. తన విషయాలన్నీ షేర్ చేయడం సమంతకు అలవాటే కాబట్టి... సమంత ఈ బర్త్ డే పిక్స్ ను కూడా పోస్ట్ చేస్తంది కదా మరి.

Follow Us:
Download App:
  • android
  • ios