నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో పడింది. గత ఏడాది అక్టోబర్ లో సామ్, చైతు ఇద్దరూ తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సమంత మానసిక ప్రశాంతత కోసం తీర్థయాత్రలకు వెళ్ళింది.

నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో పడింది. గత ఏడాది అక్టోబర్ లో సామ్, చైతు ఇద్దరూ తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సమంత మానసిక ప్రశాంతత కోసం తీర్థయాత్రలకు వెళ్ళింది. అనంతం స్నేహితులతో కలసి వెకేషన్స్ కి కూడా వెళ్ళింది. 

అలాగే తన సినిమాలో బిజీ అవుతూ వర్క్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం సమంత కొన్ని పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా సమంత ఇటీవల స్విట్జర్లాండ్ వెకేషన్ కు వెళ్ళింది. అక్కడి దృశ్యాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. 

అక్కడ స్విస్ ప్రకృతి అందాలలో ఐస్ స్కీయింగ్ చేస్తున్న ఫోటోలు, వీడియోల్ని సమంత ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. ఏమాత్రం బెదురు లేకుండా సమంత స్కీయింగ్ చేస్తున్న వీడియో నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆమె షేర్ చేస్తున్న ఫోటోస్ కి సెలెబ్రిటీలు కామెంట్స్ చేస్తున్నారు. 

View post on Instagram

సమంత ఎల్లో డ్రెస్ లో మెరుస్తోంది. స్కీయింగ్ చేస్తున్నప్పుడు సేఫ్టీ గా హెల్మెంట్ ధరించి కనిపిస్తోంది. సింగర్ చిన్మయి కామెంట్ చేస్తూ.. నీవు ఏదైనా సాధించగలవు.. ఏదైనా కాంపిటీషన్ లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించు' అని పేర్కొంది. దీనికి సమంత రిప్లై ఇస్తూ ఇప్పుడే బేసిక్స్ నేర్చుకున్నా అని బదులిచ్చింది. సమంతకు స్కీయింగ్ లో సూచనలు ఇస్తున్న కోచ్ కూడా కామెంట్ చేశాడు. డే బై డే ఆమె పెర్ఫామెన్స్ లో పురోగతి కనిపిస్తోంది అని బదులిచ్చాడు. 

ఇదిలా ఉండగా సమంత రీసెంట్ గా పుష్ప చిత్రంలో ఊ అంటావా మావ అంటూ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ప్రస్తుతం సమంత యశోద అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం చిత్రంలో నటిస్తోంది. 

View post on Instagram