సమంత నటించిన 'ఓ బేబీ' చిత్రం శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలతో పాటు పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. సమంత ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది. 70 ఏళ్ల వృద్ధురాలు 20 ఏళ్ల యువతిగా మారిపోయే పాత్రలో సమంత నటిస్తోంది. 

ట్రైలర్ కు విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నాగశౌర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. స్టార్ హీరోల రేంజ్ లో ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంపై సమంత స్పందించింది. నాకు ఎంతోకొంత పాపులారిటీ ఉన్న మాట వాస్తవమే. 

స్టార్ హీరోల చిత్రాలు ఆడియన్స్ ఎగబడతారు. కానీ నా సినిమాకు ప్రేక్షకులని రప్పించాలంటే ప్రమోషన్స్ ఎక్కువగా చేయాలి అని సమంత తెలిపింది. ఈ చిత్రంలో తాను కామెడీ పండించడంపై సమంత మాట్లాడింది. నటనలో కామెడీ పండించడమే కష్టమైన పని. ఓ బేబీ చిత్రంలో కామెడీ పరంగా, ఎమోషన్స్ అన్ని విధాలుగా తన పాత్ర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని తెలిపింది. 

ఇక తరచుగా తాను గర్భవతిని అండూ వస్తున్న రూమర్స్ పై సమంత తన అభిప్రాయం చెప్పింది. అలాంటి రూమర్స్ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పెళ్ళైన వారి విషయంలో సహజంగా ఇలాంటి వార్తలు వస్తుంటాయి. పిల్లల విషయంలో ప్లానింగ్ ఏంటని నేను కూడా నా ఫ్రెండ్స్ ని అడుగుతుంటాను. సమయం వచ్చినప్పుడు పిల్లలు పుడతారు.. అదేం సీక్రెట్ కాదుగా అని సమంత సరదాగా స్పందించింది.