Asianet News TeluguAsianet News Telugu

నాగ్ కు సుచీలీక్స్ సెగ... ఇక లీకయ్యేది సమంత, సిద్ధార్థ్ లవే

  • సమంతను భయపెడుతున్న సుచీలీక్స్
  • నాగార్జునకు మళ్లీ తలనొప్పిగా మారిన కుమారుని పెళ్లి
  • ఇప్పటికే అఖిల్ పెళ్లి వ్యవహారంతో తలపట్టుకున్న నాగ్

 

samantha siddharth suchileaks

దక్షిణాది సినీ తారల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న తాజా అంశం సుచీ లీక్స్. సింగర్ సుచిత్ర ట్విట్ర ఎకౌంట్ నుంచి లీకవుతున్న అనేక మంది ఫోటోలు, వీడియోలు సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సుచీ లీక్స్లో మరో సంచలనం జరగబోతోందట. పలువురు, హీరోలు, హీరోయిన్లను సుచీలీక్స్ ఉచ్చులోకి లాగిన సుచిత్ర.. తాజాగా, సమంతనూ ఇందులోకి లాగిందట.

 

త్వరలో సమంత, సిద్ధార్థ వ్యక్తిగత వీడియోలను కూడా లీక్ చేస్తానంటూ బెదిరిస్తోందట. సిద్ధార్థ, సమంతలు లవ్ చేసుకున్నారని, బ్రేకప్ చెప్పేసుకున్నారన్న వార్తలు అప్పట్లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుచీలీక్స్‌లో వచ్చిన ఈ బెదిరింపు టాలీవుడ్‌కు షాక్ కలిగిస్తోంది. వాస్తవానికి సుచిత్ర.. తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని చెబుతున్న నేపథ్యంలో ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు.

 

ఇప్పటికే సుచీలీక్స్ పేరిట వచ్చిన పలు పోస్టులు, వీడియోలను డెలీట్ చేసేశారు. మరోవైపు.. సుచీలీక్స్ అని టైప్ చేయగానే ఎన్నో ఫేక్ అకౌంట్లు వస్తున్న నేపథ్యంలో సమంత-సిద్ధూల వీడియోను లీక్ చేస్తారన్న బెదిరింపులు ఎంత వరకు నిజమై ఉంటాయని అనుకుంటున్నారు. అంతేకాకుండా ఈ బెదిరింపు వచ్చిన అకౌంట్ ఫేక్‌దేనని, కావాలనే ఇలా రచ్చ చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కొందరు అంటున్నారు.

 

కాగా అఖిల్ పెళ్లి వ్యవహారంతో గత కొద్ది రోజులుగా సతమతమవుతూ... ఓ రెండ్రోజులుగా తిరిగి తనదైన జీవితం గడుపుతున్న నాగార్జునకు ఈ వార్త మరో షాక్ నిస్తోంది. సమంత గతంలో సిద్ధార్థ్ తో డేటింగ్ చేస్తోందని రూమర్స్ వచ్చాయి. అయితే... ఆ రూమర్స్ అన్నీ మాయమై... తాజాగా అక్కినేని నాగచైతన్యతో ఎంగేజ్ మెంట్ కూడా పూర్తి చేసుకుని పెళ్లికి సిద్ధమవుతున్న సమంతపై సుచీలీక్స్ లో ఇలాంటి ట్వీట్ రావడం టెన్షన్ పెడుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios