సమంతనటిస్తున్న పౌరాణిక చిత్రం 'శాకుంతలం' ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో విజువల్ ఫీస్ట్ గా తెరకెక్కించిన ఈ చిత్ర ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలయింది. 

వరుసగా అద్భుతమైన చిత్రాలతో దూసుకుపోతున్న సమంతకి ఆరోగ్య సమస్యలు బ్రేక్ వేశాయి. కొన్ని నెలల నుంచి సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సమంత పూర్తిగా కోలుకుంది. దీనితో సమంతనటిస్తున్న పౌరాణిక చిత్రం 'శాకుంతలం' ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గుణశేఖర్ దర్శకత్వంలో విజువల్ ఫీస్ట్ గా తెరకెక్కించిన ఈ చిత్ర ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలయింది. ఈ చిత్రంలో మహాభారతంలో దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథని గుణశేఖర్ ఎమోషనల్ జర్నీగా చూపించబోతున్నారు. ట్రైలర్ చూస్తే అదే అర్థం అవుతుంది. శకుంతల ఎలా జన్మించింది అనే అంశాలతో ట్రైలర్ ప్రారంభించారు. 

ఆమె పుట్టుక, యవ్వన వయసులో ప్రేమ ఆ తర్వాత ఎదురయ్యే కష్టాలు కన్నీళ్లు ఇలా ఎమోషనల్ జర్నీగా ట్రైలర్ సాగుతోంది. ఈ భూమి మీద అమ్మా నాన్నలకి అక్కర్లేని తొలి బిడ్డ.. మేనకా విశ్వామిత్రుల ప్రేమకి గుర్తుగా ఈ బిడ్డ పుట్టింది అనే సన్నివేశాలతో ట్రైలర్ ప్రారంభం ఐంది. 

ఆ తర్వాత శకుంతలగా సమంత అపురూప సౌదర్యంతో ఎంట్రీ ఇచ్చింది. అడవిలో తన చెలికత్తెలతో ఎంత సరదాగా ఉంటోందో చూపించారు. ఆ సమయంలోనే దుశ్యంత మహారాజు ఆమెని చూడడం, ప్రేమించడం జరుగుతుంది. ఆయా ప్రేమ తర్వాత శకుంతలకి అసలు కష్టాలు మొదలవుతాయి. శకుంతల కర్మ ఫలం, దుర్వాస మహర్షి శాప ఫలితం వల్ల శకుంతల కష్టాల పలు అవుతుందని చూపించారు. 

ఆమె పడే కష్టాలు భూమాతకు సైతం భారమే, కర్మకి ఎవరూ అతీతులు కారు అంటూ వినిపించే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఓవరాల్ గా సమంత ఎమోషనల్ పెర్ఫామెన్స్, అద్భుతమైన గ్లామర్ లుక్ ఈ ట్రైలర్ లో చూడొచ్చు. విజువల్స్ కూడా బావున్నాయి. చివర్లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ.. భరతుడి పాత్రలో ఇచ్చే ఎంట్రీ అదుర్స్ అనే చెప్పాలి. ఫిబ్రవరి 17న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. 

YouTube video player