కొన్ని సినిమాలు అలా చరిత్రలో నిలిచిపోతాయి. గెలుపోటములతో సంబంధం లేకుండా.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటాయి. అలాంటి కోవలో..రిలీజ్ కు రెడీగా ఉంది సమంత లీడ్ రోల్ చేసిన శాకుంతలం సినిమా. తాజాగా ఈసినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీటీమ్.
కొన్ని సినిమాలు అలా చరిత్రలో నిలిచిపోతాయి. గెలుపోటములతో సంబంధం లేకుండా.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటాయి. అలాంటి కోవలో..రిలీజ్ కు రెడీగా ఉంది సమంత లీడ్ రోల్ చేసిన శాకుంతలం సినిమా. తాజాగా ఈసినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీటీమ్.
కొన్ని పాత్రలు కోరుకున్నా జీవితంలోచేయలేవరు హీరోయిన్లు. కాని కొంత మంది హీరోయిన్లకు ఆ పాత్రలు వెతుక్కుంటూ వచ్చి గుమ్మం ముందు నిలుచుంటాయి. అలాంటి పాత్రే శకుంతల పాత్ర. ఆ పాత్ర అందిన హీరోయిన్ సమంత అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్యారెక్టర్ కోసం చాలా మంది హీరోయిన్లు ఎదురుచూస్తూ ఉంటారు..కొంత మంది కలలు కంటూ ఉంటారు. ఆ పాత్రను పోషించే అవకాశం రావడమే అదృష్టమని భావిస్తూ ఉంటారు. తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకూ అలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వచ్చింది.
సమంత ప్రధాన పాత్రను పోషించిన సినిమా శాకుంతలం. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడిగా మలయాళ యంగ్ స్టార్ దేవ్ మోహన్ నటించిన ఈసినిమా.. ఈ నెల 14 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతుంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈసినిమాను టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. మణిశర్మ స్వరపరిచిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్.

శకుంతల - దుశ్యంతుల మధ్య పరిచయం.. ప్రేమ.. రొమాంన్స్ తో పాటు.. వివాహ, విరహం, ఆతరువాత వియోగం. అందమైన అద్భుతమైన కథను.. ఓ మహాద్భుత దృశ్య కావ్యంగా మలిచారు దర్శకుడు గుణశేఖర్. ఇప్పటికే ఈసినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ తో.. సినిమపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. విజ్యువల్ ఎఫెక్ట్ తో పాటు.. సినిమాలో సెంటిమెంట్, యాక్షన్.. సీనియర్ నటీనటులు, ఇలా అన్నీ ప్లస్ పాయింట్లే కనిపిస్తున్నాయి.
మరి సినిమారిలీజ్ తరువాత తెలుస్తుంది గుణశేఖర్ కష్టం ఎంత వరకూ ఫలించింది అని. ఇక ఈసినిమాలో సమంత, దేవ్ మోహన్ తో పాటుగా.. మోహన్ బావు, అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా.. ఇలా చాలా మంది నటీనటులు సందడి చేశారు. ఈమూవీ రిలీజ్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.
