ఇటీవల సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో దర్శనమిస్తున్న సమంత అక్టోబర్ లో అక్కినేని నాగ చైతన్య ను పెళ్లి చేసుకోనున్న సమంత సమంత హాట్ హాట్ పిక్స్ పై అక్కినేని ఫ్యాన్స్ అసంతృప్తి

ఎంత సినిమా సెలెబ్రిటీలయినా ప్రయివేటు లైఫ్ లో ఎలా వున్నా, పబ్లిక్ లో మాత్రం కాస్తయినా పద్దతిగా వుండాలి. కానీ అక్కినేని వారింటికి కాబోయే కోడలు సమంత బేబీకి మాత్రం ఆ విషయం అస్సలు పట్టదు. తన ధోరణి తనదే.. అదృష్టం బాగుండి, మహిళలకు గౌరవిమిచ్చే, ప్రేమకు విలువనిచ్చే నాగ చైతన్య లాంటి వ్యక్తిత్వం గల మనిషికి భార్య అవుతోంది. అక్కినేని లాంటి పెద్ద కుటుంబానికి కోడలు అవుతోంది.

అక్కినేని కుటుంబంలో నాగార్జున సతీమణిగా వచ్చిన అమల కూడా పెళ్లికి ముందు హీరోయినే. అయితే అమల ఎప్పుడు సృతి మించలేదు. పైగా. పెళ్లికి ముందు ఎలాంటి సినిమాలు వేసినా, పెళ్లయిన తరువాత రెడ్ క్రాస్, బ్లూ క్రాస్ అంటూ సోషల్ సర్వీస్ లో తనదైన ముద్ర వేస్తూ... ఎంత పద్దతిగా వుంటోంది? ఎలాంటి పేరు తెచ్చుకుంది?

కానీ సమంతకు అవేవీ పట్టడం లేదు. తను పర్సనల్ గా పెట్టుకోవాల్సిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో వదులుతూ రోజు రోజుకూ తగ్గాల్సిన అంశాల్లో రెచ్చిపోతోంది. అప్పటికి ఆ మధ్య నాగా చైతన్య అననే అన్నాడు. తనకు సమంతలో నచ్చని విషయం అదే అని. అయినా అడ్జస్ట్ కావడం అలవాటు చేసుకుంటున్నా అని. మొన్నటికి మొన్న ఓ మేగజిన్ కవర్ కోసం హాట్ ఫోజ్ ఇస్తూ ఫొటో సెషన్ చేసింది. ఇప్పుడు తన టాప్ అండ్ బాటమ్ బికినీ ఫొటోలను సోషల్ నెట్ వర్క్ లో పెట్టింది. దీనిపై చాలా విమర్శలు వినిపిస్తున్నాయి.

పెద్దింటి కోడలు కాబోతోంది. కాస్త పద్దతిగా వుండొచ్చుగా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగా చైతన్య అడ్జస్ట్ అవుతాడు. కానీ ఎంతవరకు? అది కూడా సమంత ఆలోచించుకోవాలి కదా..