ఈ సినిమాలో పురు రాజవంశపు రాణి కావ్య నాయకి శకుంతల దేవి పాత్రలో సమంత కనిపించనుంది. సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు.


 సమంత తన కెరీర్ లో తొలిసారి పౌరాణిక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి శాకుంతలం మూవీ చేసింది. పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో రూపోందిని ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించగా.. ఈ నెల (ఏప్రిల్) 14న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ‘శాకుంతలం’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం శకుంతల పాత్రలో నటించిన సమంత.. ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఎవరికీ తెలియని విషయాలను వివరించింది. ట్విట్టర్​లో పోస్ట్​ చేసిన ఓ వీడియోలో సామ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. 

సమంతకు పూల ఎలర్జీ ఉందట. ఈ సినిమాలో తాను ధరించిన పూల వల్ల చేతికి మొత్తం ర్యాషెస్ వచ్చాయని, అదొక ఫ్లవర్ టాటూలాగా కనిపించేదని చెప్పింది. ఆరు నెలల పాటు అది అలాగే ఉండిపోయిందని, షూటింగ్​లో కనిపించకుండా ఉండేందుకు దానిపై మేకప్ చేసినట్లు తెలిపింది. 

అలాగే శాకుంతలం కథ గురించి సమంత చెప్తూ... ఇది ఐదవ శతాబ్దంలో రాసిన కథ. అయితే ఇప్పటి మోడ్రన్‌ అమ్మాయి అయిన నేను ఆ క్యారె క్టర్‌తో రిలేట్‌ అవుతున్నాను. శకుంతల పాత్ర నేటి అమ్మా యిలకు కనెక్ట్‌ అవుతుంది. ఈ శకుంతల పాత్ర చేయటం అనేది నటిగా నాకు ఓ పెద్ద బాధ్యత. దాంతో ముందు నేను భయపడ్డాను. అందుకనే గుణ శేఖర్‌గారు అడగ్గానే నో చెప్పా ను. నేను అప్పుడే రాజీ పాత్ర చేసి వచ్చాను. ఇప్పుడు చేసే శకుంతల పాత్రలో చాలా అందంగా కనిపించాలి. ప్రతీ ఫ్రేమ్‌ లో అందంతో పాత్రలో ఓ డిగ్నిటీ-, గ్రేస్‌ కనపడాలి. నేను ఆ పాత్రకు న్యాయం చేశాననే అనుకుంటు-న్నాను. అందుకు కారణం నా దర్శకుడు, నిర్మాత నా నటనపై సంతృప్తిగా ఉన్నారు అని చెప్పుకొచ్చింది. 

ఈ సినిమా కోసం సమంత సొంతంగా మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తెలుగు, తమిళం, హిందీల్లో తాను డబ్బింగ్ చెప్పానని, ఇలా వేర్వేరు భాషల్లో చెప్పడం చాలా కష్టమైన పని అంది. 

ఈ మూవీకి సెన్సార్‌ బోర్డు క్లీన్ U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే ఈ శాకుంతలం రన్‌ టైం 142 నిమిషాలు ( 2 గంటల 22 నిమిషాలు) అని తెలిసింది. శాకుంతలం టీజర్‌, ట్రైలర్‌తోపాటు పాటలకు భారీ స్పందన రావడం ప్రేక్షకుల్లో ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమాలో పురు రాజవంశపు రాణి కావ్య నాయకి శకుంతల దేవి పాత్రలో సమంత కనిపించనుంది. సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు.