క్రేజీ హీరోయిన్ సమంత వివాహం తర్వాత మరిన్ని విజయాలతో దూసుకుపోతోంది. గత ఏడాది నుంచి సామ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండిస్తున్నాయి. మహానటి, రంగస్థలం, అభిమన్యుడు, యుటర్న్, ఈ ఏడాది విడుదలైన మజిలీ చిత్రాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 

హీరోయిన్లు తరచుగా ట్రోలింగ్ బారీన పడుతుంటారు. సమంత కూడా అందుకు అతీతం కాదు. సోషల్ మీడియాలో సమంత చేసే కొన్ని పోస్ట్ లకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సందర్భాలు ఉన్నాయి. ట్రోలింగ్ పై తాజాగా సమంత తన అభిప్రాయాన్ని బయట పెట్టింది. కెరీర్ ఆరంభంలో నాపై వస్తున్న ట్రోలింగ్ చాలా భయాన్ని కలిగించేది. 

సోషల్ మీడియాలో నాపై వస్తున్న విమర్శలు చూసి పిచ్చిదాన్ని అయిపోతానేమో అని అనుకునేదాన్ని. కానీ ట్రోలింగ్ ని సీరియస్ గా తీసుకోకూడదని క్రమంగా నేర్చుకున్నా. ఒకప్పుడు ఏ ట్రోలింగ్ వల్ల అయితే భాదపడ్డానో ఇప్పుడు అలాంటి విమర్శలు, కామెంట్స్ చూస్తూ నవ్వుకుంటున్నాను అని సమంత తెలిపింది. ట్రోలింగ్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చని తెలుసుకున్నా అని సమంత అంటోంది. 

నేను ట్వీట్ చేసినా, సోషల్ మీడియాలో ఏదైనా షేర్ చేసినా చాలా మంది లైక్ చేస్తారు. అలాగే నేను ఏం చేసినా విమర్శించే బ్యాచ్ ఒకటుంటుంది అని సమంత అభిప్రాయపడింది. ప్రస్తుతం సమంత ఓ బేబీ చిత్రంలో నటిస్తోంది. నందినిరెడ్డి ఈ చిత్రానికి దర్శకురాలు. ఓ ఫోటో స్టూడియోలోకి వెళ్లిన వృద్ధురాలు 20 ఏళ్ల యువతిగా తిరిగొచ్చే పాత్రలో సమంత నటిస్తోంది.