సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు గ్లామరస్ గా ఉండాల్సిందే.. లేదంటే ఎక్కువ కాలం తమ కెరీర్ ని కొనసాగించలేరు. ఈ విషయం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి బాగా తెలుసు.. అందుకే పెళ్లైనా కూడా తన గ్లామర్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటుంది. 

భారీ స్థాయిలో వర్కవుట్లు చేస్తూ రోజురోజుకి మరింత ఫిట్ గా తయారవుతోంది. ఎప్పటికప్పుడు ఫోటోషూట్ లలో పాల్గొంటూ తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ చిన్ని గౌను వేసుకొని ఫోటోలకు ఫోజిచ్చింది.

ఈ ఫ్రాక్ వేసుకోవడానికి ఎంతగానో ఎదురుచూశానని తన పోస్ట్ లో రాసుకొచ్చింది. ముప్పై ఏళ్లు దాటినప్పటికీ ఇంకా గ్లామర్ గా స్లిమ్ గా అందంగా కనిపించడానికి సమంత బాగానే ట్రై చేస్తోంది.

తన బట్టల గురించి ఎవరెన్ని కామెంట్స్ చేస్తున్నా.. వాటిని ఎంతమాత్రం పట్టించుకోకుండా తనదైన శైలిలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'ఓ బేబీ' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్స్ లో సమంత బిజీబిజీగా గడుపుతోంది.  

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

It’s time for that mani 🤓 📷 @akshay.rao.photography .. @lpa @risnjewels @jukalker @sadhnasingh1 @chakrapu.madhu

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Jun 11, 2019 at 10:41pm PDT