Asianet News TeluguAsianet News Telugu

వెంకీ నారప్ప పై సమంత రెస్పాన్స్!

నారప్ప మూవీపై అక్కినేని కోడలు స్టార్ హీరోయిన్ సమంత స్పందించారు. ఆమె నారప్ప చిత్రానికి వన్ వర్డ్ రివ్యూ ఇచ్చారు. 

samantha response on venkatesh narappa she felt excited ksr
Author
Hyderabad, First Published Jul 22, 2021, 11:16 AM IST

వెంకీ మామ ప్రయోగాత్మకంగా చేసిన నారప్ప అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. జులై 20 నుండి ఈ చిత్రం స్ట్రీమ్ అవుతుంది. ధనుష్ హీరోగా 2019లో విడుదలైన తమిళ చిత్రం అసురన్ రిమేక్ గా నారప్ప తెరకెక్కిన విషయం తెలిసిందే. డీ గ్లామర్ లుక్ లో ఛాలెంజింగ్ రోల్ చేసిన వెంకటేష్ ఆకట్టుకున్నారు. యువకుడిగా, మధ్య వయస్కుడిగా రెండు భిన్న పాత్రలో వెంకటేష్ ఒదిగిపోయి నటించారు. మొత్తంగా నారప్ప చిత్రం సైతం పాజిటివ్ టాక్ అందుకుంది. 


కాగా ఈ మూవీపై అక్కినేని కోడలు స్టార్ హీరోయిన్ సమంత స్పందించారు. ఆమె నారప్ప చిత్రానికి వన్ వర్డ్ రివ్యూ ఇచ్చారు. నారప్ప చిత్రానికి వివిధ మీడియా సంస్థలు ఇచ్చిన రివ్యూలతో కూడిన ఫోటో పంచుకున్న సమంత... వావ్ వావ్ అంటూ కామెంట్ పెట్టారు. తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో సమంత ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. నారప్ప చిత్రం సమంతను చాలా ఎక్సయిట్మెంట్ కి గురి చేసినట్లు తెలుస్తుంది. 


దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల జాతి వివక్షత నేపథ్యంలో నారప్ప తెరకెక్కించారు. ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించారు. నారప్ప చిత్రానికి మెలోడీ కింగ్ మణిశర్మ సంగీతం అందించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios