MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nithyananda: భార్య తిడుతున్నా వినలేదు, రాసలీలల నిత్యానంద స్వామిని ఇంటికి పిలిచి మరీ టోపీ పెట్టిన డైరెక్టర్

Nithyananda: భార్య తిడుతున్నా వినలేదు, రాసలీలల నిత్యానంద స్వామిని ఇంటికి పిలిచి మరీ టోపీ పెట్టిన డైరెక్టర్

టాలీవుడ్ డైరెక్టర్ తేజ వివాదాస్పద నిత్యానంద స్వామితో తనకు ఎదురైన అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. నిత్యానందకి తానూ రూ లక్ష ఎలా టోపీ పెట్టానో అనే విషయాన్ని వివరించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 28 2026, 04:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nithyananda
Image Credit : Asianet News

Nithyananda

నిత్యానంద స్వామి గురించి పరిచయం అవసరం లేదు. స్వామీజీగా ఆయన ఎందరో భక్తులని సొంతం చేసుకున్నారు. భక్తులు ఆయనపై పెట్టుకున్న నమ్మకాలన్నీ నిత్యానంద స్వామి సాగించిన రాసలీలలతో పోయాయి. చివరకు జనాలు ఛీ కొట్టి, అరెస్ట్ అయ్యే వరకు నిత్యానంద స్వామి దిగజారిపోయారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నిత్యానంద రాసలీలలు
Image Credit : our own

నిత్యానంద రాసలీలలు

నటి రంజితతో రాసలీలలు నడుపుతున్న నిత్యానంద స్వామికి సంబంధించిన వీడియో లీక్ కావడంతో అతడి బండారం మొత్తం బయట పడింది. నటి రంజిత, నిత్యానంద వ్యవహారం బయటపడ్డాక ఆయన ఆశ్రమంలో ఉన్న మహిళలు కూడా నిత్యానంద లైంగిక వేధింపుల గురించి బయట పెట్టారు. దీనితో పోలీసులు అతడి అరెస్ట్ చేయడం జరిగింది. కేసు కోర్టులో నడుస్తుండగా నిత్యానంద దేశం విడిచి పారిపోయారు.

35
డైరెక్టర్ తేజ ఇంటికి వచ్చిన నిత్యానంద
Image Credit : our own

డైరెక్టర్ తేజ ఇంటికి వచ్చిన నిత్యానంద

నిత్యానందతో తనకు ఎదురైన ఒక ఆసక్తికర సంఘటనని టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ తేజ బయట పెట్టారు. కష్టం, అవసరం అనేవి మనిషి ఏం చేయడానికి అయినా సిద్ధపడేలా చేస్తాయి. మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు. నిత్యానంద స్వామి హీలింగ్ చేస్తారు. ఆయన వస్తే మీ అబ్బాయికి ఆరోగ్యం కుదుటపడుతుంది అని చెప్పారు. పిల్లాడి ఆరోగ్యం గురించి కాబట్టి నేను కూడా సరే అన్నాను. కాకపోతే నిత్యానంద స్వామి రావాలి అంటే ఆయన ఆశ్రమానికి కానీ, ట్రస్ట్ కి కానీ రూ లక్ష డొనేట్ చేయాలి అని చెప్పారు. సరే అని రూ లక్ష చెక్కు ఇచ్చాను. నిత్యానంద స్వామి ఇంటికి వచ్చారు. అబ్బాయి ఏదో చేసి వెళ్లిపోయారు. ఆయన రాగానే మా ఇంట్లో పనిమనిషి, నా భార్య అందరూ కాళ్లపై పడి మొక్కారు. నేను మాత్రం దూరంగా నిలబడి చూస్తూ ఉన్నాను.

45
లక్ష రూపాయలు ఎగ్గొట్టిన తేజ
Image Credit : Twitter

లక్ష రూపాయలు ఎగ్గొట్టిన తేజ

ఆయన వెళ్ళిపోయాక కొన్ని రోజులకు నేను ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది. ఇదేంటి ఇలా చేశావ్, ఆయనకి చెక్కు ఎందుకు ఇచ్చావ్, అది బౌన్స్ అయింది అంటూ నా భార్య నన్ను తిట్టింది. మళ్ళీ వేరే చెక్కు ఇచ్చాను. అది కూడా బౌన్స్ అయింది. ఏంటి మళ్ళీ ఇలా చేశావ్ అంటూ నా భార్య తిట్టడం మొదలు పెట్టింది. పనిలో ఉంది మర్చిపోయినట్లు ఉన్నా. వెళ్లి అకౌంట్ లో డబ్బులు వేస్తా అని బ్యాంకు కి బయలుదేరా. వెంటనే నిత్యానంద స్వామి రాసలీలల గురించి న్యూస్ వచ్చింది. అమ్మాయిలతో ఉంటూ దొరికిపోయాడు, అరెస్ట్ చేశారు అంటూ టీవీల్లో న్యూస్ వస్తోంది. అంతే అకౌంట్ లో డబ్బులు వేయకుండా ఆగిపోయా. మన డబ్బు చాలా స్ట్రాంగ్ అని ఫీలైనట్లు తేజ తెలిపారు. ఆ విధంగా డబ్బులు ఎగ్గొట్టి నిత్యానందకే డైరెక్టర్ తేజ టోపీ పెట్టారు.

55
సిట్యుయేషన్ మన కంట్రోల్ లో ఉండదు
Image Credit : Twitter

సిట్యుయేషన్ మన కంట్రోల్ లో ఉండదు

తేజ మాట్లాడుతూ ఈ సంఘటనతో నాకు ఒకటి అర్థం అయింది. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు సిట్యుయేషన్ మన కంట్రోల్ లో ఉండదు. ఏం చేయడానికి అయినా రెడీ అయిపోతాం. వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నట్లు.. నేను కూడా నిత్యానందని నమ్మేశా అని తేజ అన్నారు. మనకు వచ్చిన సమస్యలని బట్టి మతాలు మారిపోతాం, దేవుళ్ళని మార్చేస్తాం, ఏం చేయడానికి అయినా రెడీ అవుతాం అని తేజ అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
Balakrishna: నేను ఇక ఉండను, పిల్లలని చూసుకో..కాల్పులకు ముందు రోజు తీవ్ర డిప్రెషన్ లో బాలయ్య, జరిగింది ఇదే
Recommended image2
పచ్చిగా చెప్పాలి అంటే ముసలిది అంటున్నారు, ఉదయ్ కిరణ్ తో 2 ఛాన్సులు మిస్..40 ఏళ్ళైనా అందుకే నో మ్యారేజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved