MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balakrishna: నేను ఇక ఉండను, పిల్లలని చూసుకో..కాల్పులకు ముందు రోజు తీవ్ర డిప్రెషన్ లో బాలయ్య, జరిగింది ఇదే

Balakrishna: నేను ఇక ఉండను, పిల్లలని చూసుకో..కాల్పులకు ముందు రోజు తీవ్ర డిప్రెషన్ లో బాలయ్య, జరిగింది ఇదే

2004లో బాలకృష్ణ నివాసంలో కాల్పుల సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు ముందు రోజు బాలయ్య తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నారట. దగ్గుబాటి వెంకటేశ్వర రావు సంచలన నిజాలు బయటపెట్టారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 28 2026, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nandamuri Balakrishna
Image Credit : Asianet News

Nandamuri Balakrishna

2004 లో నందమూరి బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల సంఘటన సినీ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృస్టించింది. ఈ ఘటనతో టాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది అనే చెప్పాలి. బాలకృష్ణ ఇంట్లో అప్పుడు సత్యనారాయణ చౌదరి అనే జ్యోతిష్యుడిపై, నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో వారు గాయపడడం కూడా జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కాల్పులకు ఒక రోజు ముందు జరిగింది ఇదే
Image Credit : Asianet News

కాల్పులకు ఒక రోజు ముందు జరిగింది ఇదే

ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసుని కొట్టివేశారు. ఈ సంఘటనపై దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. కాల్పులకు ఒక రోజు ముందు నేను బాలకృష్ణ ఇంటికి వెళ్ళాను. అప్పుడు బాలకృష్ణకి ప్రమాదంలో కాలు విరగడంతో ఆపరేషన్ జరిగింది. 15 రోజుల నుంచి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. పరామర్శించడానికి నేను వెళ్లాను.

Related Articles

Related image1
Kota Srinivasarao: కోట అప్పుడే చెప్పారు, వినలేదు.. సునీల్ ని డైరెక్ట్ గా ఏకిపారేసిన అభిమాని
Related image2
పచ్చిగా చెప్పాలి అంటే ముసలిది అంటున్నారు, ఉదయ్ కిరణ్ తో 2 ఛాన్సులు మిస్..40 ఏళ్ళైనా అందుకే నో మ్యారేజ్
35
తీవ్రమైన డిప్రెషన్ లో బాలయ్య
Image Credit : Asianet News

తీవ్రమైన డిప్రెషన్ లో బాలయ్య

అప్పుడు బాలయ్య నాతో చాలా డిప్రెషన్ లో ఉండి మాట్లాడాడు. నేను ఇక బతకను.. పిల్లలని నువ్వే చూసుకోవాలి బావా అని అన్నాడు. అంత తీవ్రమైన డిప్రెషన్ లో బాలయ్య ఉండడానికి కారణం ఉంది. కాలు విరగడంతో మునుపటిలా తాను డ్యాన్సులు, ఫైట్స్ చేయలేను ఏమో అనే బాధ ఉంది. లక్ష్మీ నరసింహ చిత్రాన్ని ఎక్కువ సెంటర్స్ లో 100 రోజులు ఆడిస్తాం అని నిర్మాత బెల్లంకొండ సురేష్ ముందుగా చెప్పారు.

45
లక్ష్మీ నరసింహ మూవీ కూడా కారణమే
Image Credit : Asianet News

లక్ష్మీ నరసింహ మూవీ కూడా కారణమే

కానీ ఎక్కువ సెంటర్స్ లో ఉంచకుండా ఆ చిత్రాన్ని తీసేస్తూ వచ్చారు. ఆ బాధ మరొకటి. ఈ రెండు కారణాల వల్ల బాలయ్య తీవ్ర డిప్రెషన్ లో కనిపించారు. అందుకే నేను ఇక ఉండను అనే మాట బాలయ్య నోటి నుంచి వచ్చింది అని వెంకటేశ్వర రావు అన్నారు.

55
వైఎస్ఆర్ సేవ్ చేశారా ?
Image Credit : google

వైఎస్ఆర్ సేవ్ చేశారా ?

ఆ మరుసటి రోజు నేను వేరే ఫంక్షన్ కి వెళుతుంటే ఇలా జరిగింది అని కాల్ వచ్చింది. వెంటనే కారు వెనక్కి తిప్పు తాను హాస్పిటల్ కి వెళ్లినట్లు వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ సంఘటన తర్వాత పురందేశ్వరి, వెంకటేశ్వర రావు.. అప్పటి సీఎం వైఎస్ఆర్ ని కలిసి బాలయ్యని సేవ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. తాను దీని గురించి అసలు వైఎస్ఆర్ తో మాట్లాడనేలేదు అని అన్నారు. కానీ ఈ సంఘటనని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంత సీరియస్ గా మాత్రం తీసుకోలేదు అని వెంకటేశ్వర రావు అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Shah Rukh Khan Net Worth: 1500తో ముంబైకి వచ్చి..12,490 కోట్లకు కింగ్ గా మారిన బాద్షా ఆస్తుల వివరాలు ఇవే
Recommended image2
ANR: రొమాన్స్ చేసిన జమునకి ఏఎన్నార్ అన్నగా నటించిన ఏకైక సినిమా? దొంగరాముడు మూవీ రివ్యూ
Recommended image3
Nagabandham: 8 గంటల మేకప్, నిద్ర లేదు.. 'నాగబంధం' కోసం KGF గరుడ రామ్ పడిన కష్టాలు
Related Stories
Recommended image1
Kota Srinivasarao: కోట అప్పుడే చెప్పారు, వినలేదు.. సునీల్ ని డైరెక్ట్ గా ఏకిపారేసిన అభిమాని
Recommended image2
పచ్చిగా చెప్పాలి అంటే ముసలిది అంటున్నారు, ఉదయ్ కిరణ్ తో 2 ఛాన్సులు మిస్..40 ఏళ్ళైనా అందుకే నో మ్యారేజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved