రంగస్థలం  1985... ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ సినిమా అనే చెప్పుకోవాలి. ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్న వారిలో కేవలం మెగా అభిమానులే కాదు ఎంతో మంది ఉన్నారు. కారణం ఆ సినిమా పోస్టర్లు - ట్రైలర్ ఆ ఆసక్తిని పెంచేశాయి. ఇప్పుడు మరో టీజర్ వచ్చేందుకు సిద్దమవుతోంది. అది కూడా సమంత స్పెషల్ టీజర్ అది. 

మొన్న విడుదలైన రంగస్థలం టీజర్ లో సమంత ఎక్కడా కనిపించలేదు. అంత చిట్టిబాబే. చెవిటి వాడైన చిట్టిబాబు పాత్ర ఎలా ఉంటుందో చూపించానికే ఆ టీజర్ విడుదల చేశారు. దీంతో సమంత ఫ్యాన్స్ తో పాటూ అక్కినేని వారి ఫ్యాన్స్ కూడా చాలా ఫీలైపోయారు. సమంత ఎక్కడా బయటపడకపోయినా... ఆమె కూడా లోలోపల బాధపడినట్టే సమాచారం. ఆ లోటును భర్తీ చేసేందుకు సమంత టీజర్ కూడా వచ్చేస్తోంది. 20 సెకన్ల నిడివి కల టీజర్ ను ఇందుకు  సిద్దం చేశాడట సుకుమార్. అతి త్వరలో దీనిని విడుదల చేస్తాడట. రేపే కావచ్చు... ఎల్లుండు కావచ్చు... ఎప్పుడైనా కావచ్చు... వారం రోజుల లోపు సమంత రంగస్థలంలో ఎలాంటి పాత్ర పోషించిందో మనకు తెలిసిపోతుంది. అన్నట్టు ఆమె మూగ అనే వార్తలు కూడా వచ్చాయి. అవి నిజమో కాదో కూడా తెలిసిపోతాయి. 

రంగస్థలం 1985 సినిమా సుకుమార్ను తన ఇష్టంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. 1985 నాడు గ్రామాల్లో ఉండే పరిస్థితులు పరిసరాలు సెట్ వేసి చూపించబోతున్నాడు. అసలే సరైన హిట్లు లేక విలవిల లాడుతున్నాడు సుకుమార్. రంగస్థలం హిట్ కొడితే ... అతని దశ తిరిగిపోవడం ఖాయం.