కరోనా వల్ల అందరిలో సహజమైన ఫుడ్‌పై, ఆరోగ్యకరమైన ఫుడ్‌పై ఫోకస్‌ పెరిగింది. ఇంట్లో తయారు చేసుకునే వంటకాలకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత, ఉపాసన కలిసి కొత్త వంటకాల రుచిని ప్రజలకు చూపిస్తున్నారు. ఓట్స్ క్యారెట్‌ ఇడ్లీ ఎలా చేయాలో చేసి చూపించారు.

గత ఆదివారం ఓ వంటకంతో వచ్చారు. ఈ ఆదివారం మరో వంటకాన్ని చూపించారు. యువర్ లైఫ్ వెబ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కోసం వీరిద్దరు కలిసి పనిచేస్తున్నారు. సమంత చక్కటి హెల్దీ రెసిపీస్ చేసి చూపిస్తోంది. ఈ వారం ఆమె ఓట్స్ క్యారెట్‌ ఇడ్లీ చేసింది. మామూలు ఇడ్లీల్లో కార్బొహైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది పూర్తి పోషకాలను ఇవ్వదు. ఓట్స్, క్యారెట్‌ చేర్చడం వల్ల ఆ ఇడ్లీ న్యూట్రీషియన్‌గా మారిపోతుంది. అందుకే సమంత ఈ రెసిపీని ఎంచుకుంది. తాను వారంలో రెండు మూడు సార్లైనా ఇడ్లీ అల్పాహారంగా తీసుకుంటానని చెప్పింది. 

ఈసందర్భంగా ఉపాసన మాట్లాడుతూ, సమంత తనకు ఇన్‌ స్పిరేషన్‌ అని, సమంత హెల్డీ ఫిట్‌ ఫుల్‌ ఫిల్లింగ్‌ లైఫ్‌ని లీడ్‌ చేస్తుంటారని చెప్పారు. ఉపాసన చెబుతున్నప్పుడు సమంత తనదైన స్టయిల్‌లో నవ్వింది. తమ ఇంట్లో కూడా ఇడ్లీ మార్నింగ్‌ ఈవినింగ్‌ బ్రేక్‌ఫాస్ట్ లా తీసుకుంటామని చెప్పింది. ఉపాసన తనతో చాటు చేస్తూ ఉంటే సమంత చకచకా ఓట్స్, క్యారెట్‌ ఇడ్లీ చేసేసింది. ఆ ఇడ్లీని ఇద్దరూ టేస్ట్ చేశారు. సమంత ఓట్స్ క్యారెట్‌ ఇడ్లీ  రుచి చూశాక ఇలాంటి ఇడ్లీలైతే నేను రోజూ తింటానని చెప్పింది. యువర్‌ లైఫ్‌ వెబ్‌ అండ్‌ సోషల్‌ మీడియాఫ్లాట్‌ ఫామ్‌కి సమంత గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.