'ఏమాయ చేశావే' సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసిన సమంత... ఆ సినిమా నుండి వెనుకకు తిరిగిచూడలేదు. తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగ చైతన్యనే పెళ్లిచేసుకుంది సమంత. ప్రస్తుతం ఆమె తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరు. ఇక సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా వుంటుంది. తను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌‌లలో అకౌంట్‌లలో ఎపుడు యాక్టివ్‌గా ఉంటుంది. తెలుగులో టాప్ హీరోలకు కూడా లేనంత ఫాలోయింగ్ ట్విట్టర్‌లో సమంతకు ఉంది. ఆమె పెట్టే పోస్ట్ లు చాలా వరకూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూంటాయి. తాజాగా ఆమె ఇనిస్ట్రా స్టోరీలలో కొన్ని ఫొటోలు తన అభిమానులు కోసం ఉంచింది. ఓ అభిమాని..ఆమెను చైతన్య గారి రిలాక్సింగ్ యోగా పిక్ పెట్టండి అని అడిగితే ఓ ఫొటో పెట్టింది. చెక్క ముక్కలపై తన శరీరాన్ని బాలెన్స్ గా ఉంచిన ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
 
ఇక వెండితెరపై హీరోయిన్ గా మెప్పించారు సమంత. నాగచైతన్యతో వివాహం తర్వాత కూడా నటనా ప్రాధాన్యం ఉన్న, కథలను పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. ‘జాను’ తర్వాత ఆమె మరో సినిమా ఒప్పుకోలేదు. తాజాగా దసరా రోజున ‘బిగ్‌బాస్‌’కు వ్యాఖ్యాతగా వ్యవహరించి అలరించారు. ఇప్పుడు సమంత మరో సరికొత్త అవతారం దర్శనమిచ్చింది.

ప్రముఖ ఓటీటీ  ‘ఆహా’ వేదికగా ఓ కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సామ్‌జామ్‌.. సమంత’ పేరుతో రూపొందుతున్న ఈ షోలో సినీ ప్రముఖులతో ఆమె సరదాగా మాట్లాడుతోంది. చిరంజీవి, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ, తమన్నా, రష్మిక, సైనా నెహ్వాల్‌-పారుపల్లి కశ్యప్‌ సహా పలువురు తెలుగు సెలబ్రిటీలను ఆమె ఇంటర్వ్యూ చేస్తోంది. నవంబరు 13వ తేదీ నుంచి ఈ షో  ప్రసారం అవుతోంది.

‘జాను’ తర్వాత సమంత ‘ది ఫ్యామిలీ మెన్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. అమెజాన్‌ ప్రైమ్‌లో ఇది త్వరలోనే విడుదల అయ్యింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సామ్‌ గత కొన్ని నెలలుగా ఇంట్లోనే ఉండి ఇప్పుడు బయిటకు వచ్చింది. ఈ క్రమంలో ప్రత్యేక శిక్షణ తీసుకుని ఆహారం వండటం నేర్చుకున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఉపాసనతో కలిసి ‘యువర్‌లైఫ్‌’ అనే వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. అంతేకాదు ‘సాకి’ అనే దుస్తుల బ్రాండ్‌ను కూడా ఇటీవల ప్రారంభించారు.